GAMA Awards 2025 Grand Reveal Event: GAMA (Gulf Academy Movie Awards) అవార్డ్స్ 2025 రివీల్ ఈవెంట్‌ను దుబాయ్ వేదికగా గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు 500 మందికిపైగా తెలుగు వారు హాజరై విజయవంతం చేశారు. తెలుగు కళా, సంగీత ప్రముఖులు హాజరై GAMA ప్రాముఖ్యతను వివరించారు. వినూత్నంగా నిర్వహించిన ఈ వేడుకలో GAMA ఆర్గనైజింగ్ కమిటీ, ప్రముఖ గాయకుడు రఘు కుంచె సమక్షంలో ఈవెంట్ తేదీ, ప్రదేశం జ్యూరీ కమిటీని అధికారికంగా ప్రకటించారు. GAMA అవార్డ్స్ 2025 5వ ఎడిషన్‌ను జూన్ 7వ తేదీన దుబాయ్ షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జ్యూరీ చైర్మన్ ప్రముఖ దర్శకులు ఎ.కొదండ రామిరెడ్డి, బి.గోపాల్, మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఆధ్వర్యంలో వివిధ రంగాలకు చెందిన టాలీవుడ్ కళాకారులకు, సినిమాలకు GAMA అవార్ద్స్ అందజేయనున్నారు.
GAMA AWARDS చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త కేసరి త్రిమూర్తులు మాట్లాడుతూ.. గత నాలుగు ఎడిషన్లు గ్రాండ్‌గా నిర్వహించామని.. జూన్ 7న జరగబోయే 5వ ఎడిషన్‌కు ప్రముఖ సినీ పెద్దలను, కళాకారులను విశిష్ట అతిథులుగా ఆహ్వానిస్తున్నామన్నారు. UAEలోని తెలుగు ప్రజలకు ప్రత్యేక వినోదాన్ని అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. GAMA AWARDS సీఈఓ సౌరభ్ కేసరి మాట్లాడుతూ.. GAMA అవార్డ్స్‌ను వినూత్నంగా అత్యంత వినోదభరితంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను గుర్తించి వారికి గామా ఎక్స్‌లెన్స్ అవార్డులు అందజేస్తామన్నారు. నామినేటెడ్ అయిన విభాగాలకుపబ్లిక్ ఓటింగ్ ప్రక్రియ కూడా నిర్వహిస్తామన్నారు.
జ్యూరీ సభ్యులుగా ఉన్న ఎ.కొదండ రామిరెడ్డి, కోటి, బి.గోపాల్ ప్రత్యేకంగా వీడియో సందేశాలు పంపించారు. GAMA గొప్పతనాన్ని, కళాకారుల ప్రతిభకు అందించే ప్రోత్సాహాన్ని గురించి వెల్లడించారు. కుంచె రఘు మాట్లాడుతూ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనలాంటి కళాకారులు ఎందరో ఆసక్తిగా GAMA ఈవెంట్ కోసం ఎదురుచూస్తారని అన్నారు. GAMA తో తమకు చాలా మంచి అనుబంధం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో యాంకర్ & సింగర్ తిరు, శరణ్య తమ చక్కటి ప్రదర్శనలతో అతిథులను అలరించారు. సంగీత ప్రదర్శనలతో పాటు వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.