Big Shock To Game Changer: లోకల్ కేబుల్, ప్రైవేట్ బస్సుల్లో ‘గేమ్ ఛేంజర్’ మూవీ..!

Big Shock To Game Changer: గ్లోబర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న రామ్‌ చరణ్‌ హీరోగా శంకర్‌ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. ఈ మూవీ విడుదలై వారం రోజలు కూడా కాలేదు. అపుడు ఈ సినిమాను ఓ లోకల్‌ ఛానల్‌లో ప్రసారం చేశారు. అంతేకాదు సంక్రాంతికి ఊరుకు వెళ్లే బస్సుల్లో ప్రసారం చేయడంతో మెగాభిమానులతో పాటు గేమ్ చేంజర్ నిర్మాతలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 15, 2025, 02:43 PM IST
Big Shock To Game Changer: లోకల్ కేబుల్, ప్రైవేట్ బస్సుల్లో ‘గేమ్ ఛేంజర్’ మూవీ..!

Big Shock To Game Changer: అవును ‘గేమ్ చేంజర్’ మూవీకి మరో పెద్ద షాక్ తగిలింది. ఈ నెల 10న విడుదలైన ఈ సినిమా నిన్నటితో 5 రోజులు కంప్లీట్ చేసుకుంది. విడుదలై ఓ వారం కాకముందే ఈ సినిమాను కొన్ని లోకల్ టీవీ ఛానెల్స్ తో పాటు కొన్ని ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్లో ప్రసారం చేయడం సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. అంతేకాదు ఈ సినిమాను అన్ ఫీషియల్ గా ప్రదర్శనకు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను నెటిజన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి అసహనం వ్యక్తంచేశారు. దీనిపై టాలీవుడ్‌ నిర్మాత శ్రీనివాస కుమార్‌ (ఎస్‌కేఎన్‌) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓ సినిమా వెనక కొన్ని వేల మంది శ్రమ దాగి ఉందంటున్నారు.

ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. 5 రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాన్ని లోకల్‌ ఛానళ్లలో, బస్సుల్లో ప్రసారం చేయడం దారుణం అన్నారు. ఈ విషయం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. సినిమా అంటే కేవలం హీరో, దర్శకుడు, నిర్మాతలే కాదు.. ఇది 4 యేళ్ల కృషి. వేలాది మంది కలల ఫలితం. ఇలా లీక్‌ చేసే ముందు సినిమా విజయంపై ఆధారపడి జీవిస్తున్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల గురించి ఆలోచించాలన్నారు. ఇలాంటి పనులు చిత్ర పరిశ్రమ భవిష్యత్తుకు కూడా ముప్పు కలిగిస్తాయి. ఈ చర్యలకు ముగింపు పలికేందుకు ప్రభుత్వాలు ముందుకు రావాల్సిన అసవరం ఉంది. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. సినిమాను కాపాడడానికి, భరోసానివ్వడానికి అందరం కలిసి పని చేద్దాం’’ అని పోస్ట్‌ పెట్టారు. దీనికి #SaveTheCinema అనే హ్యాష్ ట్యాగ్‌ను జోడించారు.

ఇక తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) సినిమాని లీక్‌ చేస్తామంటూ బెదిరించిన వారిపై చిత్ర యూనిట్ ఇప్పటికే సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మూవీ రిలీజ్‌కు రెండు రోజుల ముందు కీలక సన్నివేశాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారన్నారు.  రిలీజ్‌ కాగానే ఆన్‌లైన్‌లో లీక్‌ చేశారని టీమ్‌ ఫిర్యాదులో తెలిపింది.  ఆధారాలు సేకరించిన చిత్ర బృందం.. 45 మందితో కూడిన ముఠాపై తాజాగా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే కదా. దీనిపై కేసు నమోదు చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అలాగే, సోషల్‌ మీడియా వేదికగా సినిమాపై నెగెటివిటీ సృష్టిస్తున్న కొన్ని ఖాతాల పైనా ‘గేమ్ ఛేంజర్‌’ టీమ్‌ కంప్లైంట్‌ ఇచ్చింది. మరోవైపు గేమ్ చేంజర్ మూవీ 5 రోజుల్లో దాదాపు రూ. 250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

ఇదీ చదవండి: Prabhas Marriage: ప్రభాస్ మ్యారేజ్ ఫిక్స్.. డార్లింగ్ చేసుకోబోయేది ఈమెనే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News