Happy birthday Prabhas: అభిమానులకు, స్నేహితులకు ఆయన డార్లింగ్(Darling Prabhas). సినీ పరిశ్రమలో గ్లోబల్ స్టార్. ఆయనే ప్రభాస్. నేడు (అక్టోబర్ 23) (Prabhas Birthday) ప్రభాస్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
ప్రభాస్ పూర్తి పేరు.. ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన సూర్య నారాయణరాజు, శివకుమారి దంపతులు 1979 అక్టోబరు 23న.. ప్రభాస్‌కు (Prabhas Birth date) జన్మనిచ్చారు. రెబల్ స్టార్ కృష్ణం రాజు ప్రభాస్‌కు పెదనాన్న అవుతారు.
సినీ ప్రస్థానం..
2002లో 'ఈశ్వర్' (Prabhas first Cinema) సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమయ్యారు ప్రభాస్. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత 2003లో విడుదలైన రాఘవేంద్ర సినిమా పెద్దగా ఆడలేదు. కానీ 2004లో వచ్చిన 'వర్షం' చిత్రం ప్రభాస్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత అందాల రాముడు, చక్రం వంటి సినిమాలో నటుడిగా మెప్పించారు.
2005లో రాజమౌలి దర్శకత్వం వహించిన 'ఛత్రపతి' ప్రభాస్‌ను టాలీవుడ్లో స్టార్‌ను చేసింది. ఈ సినిమాతో మాస్లో ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. 2006లో వచ్చిన 'పౌర్ణమి' సినిమా ఆడలేదు. నిజానికి ఇందులో వైవిధ్యపరమైన పాత్ర పోషించినప్పటికీ.. ఛత్రపతితో వచ్చిన మాస్ ఇమేజ్ కారణంగా సినిమా ఆడలేదని సినీ విశ్లేషకులు చెబుతుంటారు.
ఈ సినిమా తర్వాత.. యోగి, మున్నా (2007), బుజ్జిగాడు (2008), బిల్లా, ఏక్ నిరంజన్ (2009) సినిమాల్లో ప్రభాస్ నటనకు మంచి గుర్తింపునిచ్చాయి. ఇక 2010లో వచ్చిన 'డార్లింగ్' సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో లేడీ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది ప్రభాస్‌కు. ఆ తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్, (2012), రెబల్, మిర్చి (2013) సినిమాలతో ఇటు మాస్, అటు క్లాస్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారాయన.
Also read: Varun Tej Ghani Movie: 'గని' ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్డేట్.. ఎప్పుడంటే?
తెలుగు హీరో నుంచి గ్లోబల్ స్టార్‌గా..
ఇక రాజమౌలి దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కిన 'బాహుబలి' సినిమా ప్రభాస్ (Bahubali Prabhas) స్థాయిని అంతర్జాతీయ రేంజ్‌కు పెంచింది. ఈ సినిమాతో ప్రభాస్ గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. ప్రభాస్‌కు మాత్రమే కాకుండా.. తెలుగు దక్షిణాది సినిమాల రేంజ్ ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది బాహుబలి. 2015లో మొదటి పార్ట్, 2017లో రెండో పార్ట్ విడుదలై కలెక్షన్ల పరంగా అప్పటి వరకు ఉన్న ఇండియన్ ఫిలిమ్స్ రికార్డులన్నింటిని చెరిపేసింది. చైనా, జపాన్ వంటి దేశాల్లో కూడా ప్రభాస్‌కు ఈ సినిమాతో ఫాలోయింగ్ పెరిగి పోయింది.
Also read: Jai Bhim Movie Trailer: సూర్య 'జై భీమ్' ట్రైలర్ వచ్చేసింది!
బాహుబలి పెంచిన రేంజ్‌తో ప్రభాస్.. అన్ని పాన్ ఇండియా, అంతర్జాతీయ స్థాయిలోనే సినిమాలు తీస్తున్నారు. బాహుబలి తర్వాత మొదటి సినిమా 'సాహో' నుంచి మొదలు కుంటే.. విడుదలకు సిద్ధమవుతున్న 'రాధేశ్యామ్'తో పాటు.. 'ఆది పురుష్' కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో తీస్తున్న 'సలార్' నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ప్రాజెక్ట్-కే' అన్ని పాన్ ఇండియా చిత్రాలే. యాక్షన్, ఇతిహాస కథ, సైన్స్ ఫిక్షన్ ఇలా వేరు వేరు జోనర్లలో ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
వీటన్నింటితో పాటు.. 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ఇటీవల ఓ సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు ప్రభాస్. 'స్పిరిట్' అనే పేరుతో ఈ సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. దేశీయంగా, అంతర్జాతీయంగా మొత్తం 8 భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తుండటం విశేషం. స్పిరిట్‌లో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నట్లు సమాచారం.
Also read: Manchu Vishnu: 'మా' మహిళా భద్రత కోసం కమిటీ: మంచు విష్ణు
ఫ్యాన్స్‌కు బర్త్‌డే గిఫ్ట్..
రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న పాన్ ఇండియా (Pan India Movie) సినిమా రాధేశ్యామ్‌పై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. అక్టోబర్ ప్రభాస్ బర్త్ డే (Prabhas Birthday) సందర్భంగా రాధేశ్యామ్ టీజర్ (Radhe Shyam Teaser) రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. సాహో తర్వత ప్రభాస్ సినిమా ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. టీజర్లోనైనా ప్రభాస్‌ను చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Also read: Oscar Entry Movies: ఇండియా నుంచి ఆస్కార్ నామినేషన్ ఎంట్రీలు ఆ నాలుగే
Also read: Akash Puri about Puri Jagannath: నాన్నా.. నీ పని అయిపోందన్నోళ్లకు నేనే సమాధానం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook