మహేష్ బాబు, కొరటాల శివ నెక్స్ట్ షెడ్యూల్ ఈ నెల 15 నుండి బిగిన్ కానుంది. ప్రస్తుతం ఈ షెడ్యూల్ కి సంబంధించిన సెట్, మేకింగ్ ప్రాసెస్ లో ఉండటంతో చిన్న బ్రేక్ తీసుకున్న సినిమా యూనిట్, మరో 3 రోజుల తరవాత రెగ్యులర్ షూటింగ్ తో బిగిన్ చేయనుంది. స్పైడర్ మూవీ తరవాత
ఇమ్మీడియట్ గా ఈ సినిమా సెట్స్ పైకి వచ్చిన మహేష్ బాబు, ఈ గ్యాప్ లో కాస్త రిలాక్స్ అయినా 15 నుండి మళ్ళీ బిజీ కాబోతున్నాడు.మహేష్ బాబు సరసన కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న
ఈ సినిమాని జనవరి 11, 2018 న రిలీజ్ చేసే ప్రాసెస్ లో ఉంది సినిమా యూనిట్.