Vedha Motion Poster కన్నడ ఇండస్ట్రీ ప్రస్తుతం ఇండియన్ సినిమాను డామినేట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. కేజీయఫ్, కాంతార, చార్లీ 777 వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేశాయి. ఇలా కన్నడ ఇండస్ట్రీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ హీరోగా వచ్చిన వేద సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. శివ రాజ్ కుమార్ కెరీర్లో 125వ సినిమా తెరకెక్కించిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు తెలుగులోకి డబ్ అవబోతోంది.
శివ రాజ్‌కుమార్‌కు ఇది 125వ చిత్రం మాత్రమే కాకుండా.. అతని భార్య గీతా శివ రాజ్‌కుమార్ నేతృత్వంలోని గీతా పిక్చర్స్ అయిన అతని హోమ్ బ్యానర్లో ఇది మొదటి వెంచర్ అవడం కూడా విశేషమే. కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన టైటిల్, మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించింది చిత్ర బృందం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook