Karthika Deepam 2 Today: దీపను చంపడానికి జోత్స్న మాస్టర్‌ ప్లాన్‌.. అయ్యయ్యో.. పాలు పంచుకుని కలిసి పడుకుందాం అంటున్న కార్తీక్..

Karthika Deepam 2 Serial December 11th Episode: బావ దీపకు దూరమవ్వాలని ఆఫీస్కు తీసుకువస్తే దీప కూడా ఆఫీస్‌కు క్యారేజ్‌ తీసుకువచ్చింది నానమ్మ అంటుంది జోత్స్న. నాముందే దీప ప్రేమగా వండిన గుత్తివంకాయ కూర ఇరిటేట్ చేస్తూ తిన్నారు. నువ్వు ఎందుకు ఊరుకున్నావ్‌ అంటుంది పారిజాతం. అరిస్తే బావ ఊరుకుంటాడా? పెళ్లాన్ని ఒక్క మాట ఒక్క మాట అనినిస్తాడా? అని చిరగ్గా అంటుంది జోత్స్న.

Written by - Renuka Godugu | Last Updated : Dec 11, 2024, 11:26 AM IST
Karthika Deepam 2 Today: దీపను చంపడానికి జోత్స్న మాస్టర్‌ ప్లాన్‌.. అయ్యయ్యో.. పాలు పంచుకుని కలిసి పడుకుందాం అంటున్న కార్తీక్..

Karthika Deepam December 11th Episode: బావ దీపకు మొగుడైతే.. దీప నాకు మొగుడై కూర్చుంది. నావల్ల కావడంలేదు గ్రానీ, నా ఓర్పు, సహనం అన్ని చచ్చాయి. దీప తుఫానులో కొట్టుకుపోయేలా చేసింది. నాకు మనశ్శాంతి లేదు.. ఇలాగే చూస్తూ ఉండు ఆ దీపను చంపేస్తా అంటుంది. నీవల్ల కాదు అని అరుస్తూ ముందుకు వచ్చాడు దాసు. ఏం నేర్పిస్తున్నావ్‌ అంటాడు పారిజాతాన్ని.. నువ్వు అస్సలు తండ్రివేనా? నీ కొడుకు జీవితాన్ని ఎవరైనా పాడు చేస్తే ఇలాగే చేస్తావా? అంటుంది. నీ కూతురు బాధ నీకు తెలీదా? అంటుంది పారిజాతం. కానీ, జోత్స్నను కార్తీక్‌ ప్రేమించలేదు కదా.. నచ్చిన దీప మెడలో తాళి కట్టాడు దేవుడి రాతను మార్చలేవు అంటాడు దాసు. పగటి కలలు కనకు అమ్మ అంటాడు దాసు. వస్తే ఏం చేస్తావు? దీన్ని ఆ దేవుడు కూడా మార్చలేడు సుమిత్ర కొడుకుకు పారిజాతం మనవరాలికి పెళ్లి అంటుంది. 

జోత్స్న మతి బానే పనిచేస్తుంది. ఏం జోత్స్న అంతేకదా.. అంటాడు దాసు.. నాకు అవకాశం దొరుకుతుంది అప్పుడు ఆడుకుంటా అని మనసులో అనుకుంటుంది జోత్స్న. మీరు పొమ్మంటే నేను పోను, నా పని వేరే ఉంది. అది ముగించే వరకు నేను ఇలాగే తిరుగుతూ ఉంటాను. తొందరలోనే అన్నీ అర్థమవుతాయి. మీరు మాత్రం తొందరపడి ఏం చేయకండి. జోత్స్న.. ముఖ్యంగా నీకు చెబుతున్న దీప జోలికి వెళ్లకు అది ఎవరికీ మంచిది కాదు అంటాడు.

ఏంట్రా బెదిరిస్తున్నావా? అంటుంది పారిజాతం. ఎవరు వారసులు, ఎవరు అసలైన వారసులు? అని అంటాడు దాసు. అయ్యయ్యో నీలాంటి వారు బయట కాదు హాస్పిటల్‌లో ఉండాలి పోరా ఇక్కడి నుంచి అంటుంది పారిజాతం. ఒక పుట్టుక, ఒక చావు, ఒక బతుకు అని చెప్పి వెళ్లిపోతాడు దాసు. వాడేప్పుడు ఇంతే ఏం వాగుతాడు? ఎప్పుడు వాగుతాడు? వాడికే తెలీదు అంటుంది పారిజాతం. నీ కొడుకు అనే ప్రతి మాటలకు అర్థం ఉంది గ్రానీ నీకే అర్థం కావడంలేదు అని మనస్సులో గొనుక్కుంటుంది గ్రానీ.

కార్తీక్‌ బాబు.. అని బెడ్‌రూమ్‌లో కార్తీక్‌ని పిలుస్తుంది. శౌర్య ఏది? అని అడుగుతుంది. ఇప్పుడే వాళ్ల నానమ్మ తీసుకెళ్లింది. మనం ఇక్కడే పడుకుందాం అని అంటాడు కార్తీక్‌. అయితే, బయటకు వెళ్లబోతుంది దీప ఆగు.. ఎక్కడికి అంటాడు కార్తీక్‌. పాలు శౌర్యకు ఇస్తా అంటుంది. అవి నువ్వే తాగు అంటాడు. పాలు ఎక్కువ ఉన్నాయి బాబు అంటుంది. అయితే, ఇద్దరం పాలు షేర్‌ చేసుకుందాం అంటాడు కార్తీక్. వీళ్లంతా కలిసి మమ్మల్ని ఒకటి చేయాలని చూస్తున్నట్టున్నారు అని మనసులో అనుకుంటుంది దీప.

మొత్తం మీరే తాగండి కార్తీక్‌ బాబు..  అంటుంది. అప్పుడు ఓ బ్యాగ్రౌండ్‌ సాంగ్‌ వస్తుంది. దీప కార్తీక్‌కు దగ్గరగా వస్తూ ఉంటుంది. ఇవ్వు దీప అంటాడు. దీప తన చేతిలో ఉన్న పాల గ్లాసును కార్తీక్‌కు ఇస్తుంది. అప్పుడు కాస్త కంగారు పడుతూ  ఉంటుంది. కార్తీక్‌ మాత్రం దీపవైపు ప్రేమగా చూస్తు తీసుకుంటాడు. పాలు ఎక్కువ ఉన్నాయి ఒక్కడినే తాగడం కష్టం. మల్లెపూలు ఆఫీస్‌ నుంచి వచ్చేటప్పుడు తెచ్చా పెట్టుకోలేదు అంటాడు. దేవుడికి పెట్టా బాబు అంటుంది. కంగారు పడుతూ వంటగదిలో పని ఉంది అంటుంది. నేను వస్తా అంటాడు. మీరు పడుకోండి అంటుంది. నువ్వు పడుకో అంటాడు. టైం ఉంది అంటుంది, నాకు సమయం ఉంది కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుందాం అంటాడు.

ఆఫీస్‌లో జరిగిన విషయం గుర్తులేదా? జోత్న్స మిమ్మల్ని దక్కించుకోవడం వదలదు నాకు తెలుసు, తన ఆలోచన ఏంటో తెలుసా? బావను అడ్డుపెట్టుకుని దీపను ఏడిపించవచ్చు అని.. నన్నేం చేయమంటావ్‌ అంటాడు. రిజైన్‌ చేయకుండా నువ్వే ఆపావు. ఇలాంటి జరుగుతాయనే ఆ పనిచేశా. ఇప్పుడు చెప్పు నీ మనసుకు నచ్చింది చేయమంటావా? నామనసుకు నచ్చింది చేయమంటావా? అంటాడు. మీ మనసుకు నచ్చిందే చేయి బాబు అని వెళ్లిపోతుంది. చేస్తా దీప.. నా మనస్సుకు నచ్చిందే చేస్తా అని మనస్సులో అనుకుంటాడు కార్తీక్‌. ఇక ఆఫీస్‌లో జోత్స్న కావాలని కార్తీక్‌ను వేధించే పనిలో పడింది. వారంరోజులు చేసే పని ఈరోజే చేయమని పీఏకి ఇచ్చి పంపుతుంది. ఈ రాత్రంతా ఇక్కడే ఉండాలి అని కార్తీక వద్దకు వెళ్తుంది. ఇది ఒకరోజే ఎలా అవుతుంది? అంటాడు అవ్వాలి. ఎంత లేట్‌ అయినా నీ పని పూర్తి చేసే వెళ్లాలి. కావాలంటే నీతోపాటు ఇక్కడే ఉంటాను అంటుంది. 

ఇదీ చదవండి: రుద్రాణీ నోట్లో మట్టికొట్టిన పెద్దాయన.. కోర్టుకు ఈడుస్తానని రెచ్చిపోయిన ధాన్యలక్ష్మి..

ఏం బావ? మన కంపెనీలో అందరూ సమర్థులే కదా ఉన్నారు అంటుంది. ఒక మనిషి స్వభావం పదవి ఇస్తే తెలుస్తుంది అంటారు. ఎస్‌ అది నిజమే అంటాడు కార్తీక్. ఇప్పటికీ నీ మీద నాకు ప్రేమ ఉంది ఐ లవ్‌ యువర్‌ కాన్ఫిడెన్స్‌ అని కన్ను కొట్టి వెళ్లిపోతుంది. ఇక కాఫీ, టీ లు అందిస్తూ కార్తీక్ తన ప్రేమలో పడేలా వంకరాలు తిరుగుతూ ఉంటుంది జోత్న్స. దానికి తగ్గట్టు బ్యాగ్రౌండ్‌ సాంగ్‌ కూడా ఇస్తుంది. కార్తీక్‌ ఏ స్నాక్‌ తీసుకోడు. ఈ మొండి పట్టు ఎన్నాళ్లు చూస్తా. మరోవైపు ఆఫీసు నుంచి అందరూ వెళ్లిపోతారు. తన క్యాబిన్‌ నుంచే కార్తీక్‌కు సైట్‌ కొడుతూ ఉంటుంది. 

ఇదీ చదవండి: ఫామ్ హౌస్ రౌడీ.. ఆది నుంచి మోహన్ బాబు తీరు వివాదాస్పదం..

దీప ఆరుబయట కార్తీక్‌ కోసం ఎదరు చూస్తుంది. కాంచన ఏంటి దీప వాడు లేట్‌ వస్తాడు నువ్వు తినేయ్‌ అంటుంది. లేదమ్మ వచ్చాకే తింటాను అంటుంది. మరి ఫోన్‌ చేయొచ్చు కదా అంటుంది. లేదమ్మ వర్క్‌లో ఉన్నట్టున్నారు లేకపోతే ఆయనే చేస్తాడు కదా అంటుంది. జోత్స్నకు పారిజాత ఫోన్‌ చేస్తుంది. ఇంకా రాలేదు ఏంటే? అంటుంది బావను మొగుడిని పెళ్లం చూసుకున్నట్లు చూస్తున్నా. బావను చూస్తే టైం తెలియట్లేదు గ్రానీ. నేనే కాఫీ తీసుకెళ్లి ఇచ్చా అంటుంది. నువ్వు త్వరగా బయలుదేరు, తాత అడుగుతున్నాడు అని ఫోన్‌ కట్ చేస్తుంది పారిజాతం.

ఇదీ చదవండి: Nagababu Cabinet: ముగ్గురు మొనగాళ్లు.. దేశంలోనే మొదటిసారి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News