Karthika Deepam 2 Today December 23 Episode: ఇప్పుడు పంచభూతల సాక్షిగా ఏడు అడుగులు వేస్తున్నాం. ఈ అడుగులు విడిపోవు దీప అంటాడు కార్తీక్. దీప ఏడుస్తుంది. కష్టమో, నష్టమో నన్ను చేసుకున్నందుకు నువ్వు బాధపడాల్సి వస్తోంది అంటాడు. నాదేదో నడిరోడ్డుపై జీవితం నాకు ఆశ్రయం ఇచ్చి మీరు కూడా రోడ్డున పడ్డారు నాకు కత్తి కోతలా ఉంది బాబు. నేను లేకపోతే ఏసీ కారులో ఇదే రోడ్డుపై తిరిగేవారు. ఆరోజు నాదారిలో నన్ను పోనిచ్చి ఉంటే, ఈరోజు మీరు ఇలా రోడ్డున పడాల్సిన అవవసరం ఉండేది కాదు బాబు అంటుంది. అప్పుడు ఓ రాజు కథ చెబుతాడు కార్తీక్.
అప్పుడు ఆ రాజుతో ఆ రాణి చెప్పిన మాట ఇప్పుడు నేను నీతో చెబుతున్నా దీప అంటాడు కార్తీక్. మనం అనుకున్నవారు తోడుగా ఉంటే జీవితంలో తోడు ఉంటే అనుకున్నది సాధిస్తాను దీప అంటాడు. అప్పుడు రౌడీ నాన్న... అని పిలుస్తుంది. నేను ఇక నడవలేను కాలు నొప్పులు వస్తున్నాయి. ఎక్కడైనా కాసేప కూర్చుందాం నాన్న అంటుంది. అక్కడ గుడి ఉంది కాసేపు కూర్చొని వెళ్దాం అంటాడు కార్తీక్. అందరూ గుడి దగ్గరకు వెళ్లి జంట నాగులకు దండం పెడతారు. ఏంటమ్మా.. నీకిలాంటి పరిస్థితి వచ్చింది అంటుంది కాంచనను అనసూయ. తలరాతను ఎవరూ మార్చలేరు అంటుంది కాంచన.
దాసన్నకు ఫోన్ చేసి రమ్మను అంటుంది కాంచన. అక్కడ ఎదురు చూస్తుంటారు. ఇంతలో గుడికి దాసు, కార్తీక్ చెల్లి, బావమరిది అందరూ వస్తారు. ఈ బ్యాగులు ఏంటి? గుడిలో ఏం చేస్తున్నారు? అడుగుతారు. అసలు జరిగింది చెప్పు అన్నయ్య అసలు విషయం చెల్లికి చెప్పేస్తాడు కార్తీక్. సవాలు చేసి బయటకు వచ్చా అంటాడు. ఎంత పనిచేశావు అల్లుడు అంటాడు దాసు. మంచి పనిచేశావు అన్నయ్య ఆస్తి పోయినా ఫర్వాలేదు నువ్వు మాత్రం తగ్గొద్దు అంటుంది చెల్లి. నువ్వు పిలకపోవడమే మంచిది అంటారు.
గెలిచి చూపడానికి బయటకు వచ్చా. నేను ఇప్పుడు మీ ఇంటికి వస్తే బాగుండదు అంటారు. అప్పుడు నాకు తెలిసిన ఓ ఇల్లు ఉంది వెళ్దాం పదా అంటాడు దాసు. అమ్మ బ్యాగ్ నేను పట్టుకుంటా అంటాడు దాసు. అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోవైపు సుమిత్ర ఏడుస్తూ మావయ్య గారు ఇప్పటికైనా వెళ్దాం పదండి. వారు ఎక్కడ ఉన్నారో తీసుకువద్దాం అంటుంది. మనస్సు మార్చుకుని తిరిగి వస్తే నేనేం కాదనను.. అంటాడు. కాంచన ఎవరు? కార్తీక్ ఎవరు? వాళ్లు మన కుటుంబమే కదా అంటుంది. సుమిత్ర నేను అన్ని రకాల ప్రయత్నాలు చేశా అంటాడు దశరథ్. వాళ్లు నా మాట వినలేదు. మెడలో తాళి తప్ప అన్ని వస్తువులను వదిలేసి కట్టు బట్టలతో వెళ్లిపోయింది ఏం చేయను చెప్పు అంటాడు.
ఇదీ చదవండి: రాజ్‌ను ఇంప్రెస్ చేసిన కావ్య.. ఇక నుంచి నో దుబారా ఖర్చంటూ హుకూం..
దీనికంతటికీ కారణం నువ్వేనే అని తిడుతుంది జ్యోత్స్నను సుమిత్ర. అత్తయ్య మీకు ఇది శుభవార్త స్వీట్ తినండి. పాపం చాలా కష్టపడి వారిని బయటకు గెంటేసి వచ్చింది అంటుంది. మమ్మి నేను నీకూతుర్ని కాదు, ఆ దీపే నీ కూతురు చాలా.. అంటుంది జ్యోత్స్న. నీ పంథాలు నెగ్గించుకోవాలని మీరు కోరుకుంటున్నారు, మీరే గెలిచారు. నేను ఓడిపోయాను అని ఏడుస్తూ వెళ్లిపోతుంది సుమిత్ర.
అది ఇంట్లో నుంచి పోయింది దరిద్రం పోయింది. అమ్మ.. చూశావా? అది తెలివిగా అందరినీ తీసుకెళ్లింది. వాడు గుణపాఠం తెలుసుకుంటాడు. దీప మెడలో తాళి కట్టినందుకు నా బతుకు రోడ్డు పై పడింది అని మీ బావ అనుకోవాలి అంటుంది పారిజాతం. నేను అదే ఎదురు చూస్తున్న గ్రానీ అంటుంది జ్యోత్స్న.
ఇదీ చదవండి: ఘనంగా పీవీ సింధు పెళ్లి.. ఉదయ్‌పూర్ వేదికగా వెంకట దత్తతో ఏడడుగులు..గెస్టులు ఎవరొచ్చారంటే..?
మరోవైపు దీప ఫ్యామిలీ ఓ ఇంటికి చేరుకుంటారు. అల్లుడు నేను చెప్పిన ఇల్లు ఇదే అంటాడు దాసు. శౌర్య ఎందుకు? ఏమిటి అని ప్రశ్నలు వేస్తుంది. కార్తీక్ శౌర్యను కన్వీన్స్ చేస్తాడు. ఇంటి ఓనర్‌కు ఫ్యామిలీని అప్పజెప్పుతాడు దాసు. రూ.20 వేలు రెంట్ అంటాడు. బావ డబ్బులు నేనిస్తా అంటాడు కాశి. అలాగే బాబు అంటాడు ఓనర్. అయ్యో ఆ డబ్బులు కూడా లేవు అని మనసులో అనుకుంటాడు. మావయ్య, కాశి మీరంతా బయటకు వెళ్లండి అని తొందరపెడతాడు. ఏదైనా అవసరం అయితే నేను చెబుతా అంటాడు. నేను నీ చెల్లిని పరాయిదాన్ని కాదు భోజనం తెస్తా అంటుంది వద్దంటాడు. అవసరమైనప్పుడు నేనే అడుగుతా అంటాడు కార్తీక్. అందరూ వెళ్లిపోతారు. నా దగ్గర డబ్బులు లేవు అడ్వాన్స్‌గా ఈ ఫోన్ పెట్టుకోమంటాడు కార్తీక్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.