Mahesh Babu::హాలీవుడ్ రేంజ్ లో మహేష్ బాబు... రాజమౌళి సినిమా కన్నా ముందే

SSMB29: ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ఎస్ఎస్ఎంబి 29. మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం పాన్ వరల్డ్ రేంజ్ లో ముస్తాబ్ అవుతుంది అని టాక్. ఈ నేపథ్యంలో ఈ సినిమా కన్నా ముందే మహేష్ బాబు హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ చేయడంతో ఆ వీడియో కాస్త వైరల్ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 10, 2024, 04:15 PM IST
Mahesh Babu::హాలీవుడ్ రేంజ్ లో మహేష్ బాబు... రాజమౌళి సినిమా కన్నా ముందే

Mahesh Babu New Ad: తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ ఎవరు అంటే కృష్ణ తరువాత మనకు గుర్తొచ్చే పేరు మహేష్ బాబు. హాలీవుడ్ వారి సైతం అసూయపడేలా తన లుక్స్ మెయింటైన్ చేస్తారు ఈ హీరో. అందుకే ఐదు పదులు వస్తున్న ఇంకా పాతికేళ్ల కుర్రాడులా కనిపిస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటారు. 

ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలో కనిపించక పోయిన మహేష్ బాబు అంటే దేశవ్యాప్తంగా తెలియని వారు ఉండరు. సినిమాలతోనే కాకుండా పెద్ద పెద్ద బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా చేసి ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న మహేష్ బాబు ప్రస్తుతం చేసిన మరో అడ్వటైజ్మెంట్ అందరినీ ఆకట్టుకుంటుంది. త్వరలోనే మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో SSMB29, సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్ర షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ప్రస్తుతానికి మహేష్ తన ఫిట్నెస్ పై కాన్సన్ట్రేషన్ చేస్తూ ఈ సినిమా లుక్స్ కోసం తనని తాను మలుచుకుంటున్నాడు. ఇందుకోసం ఫారన్ లో ట్రైనింగ్ కూడా పొందుతున్నారు.

ఈ నేపథ్యంలో తన తదుపరి సినిమా లుక్కుతో మహేష్ చేసిన ఒక అడ్వటైజ్మెంట్ హాలీవుడ్ రేంజ్ లో అలరిస్తోంది. తాజాగా మహేష్ తాను చేసిన కొత్త యాడ్ వీడియోని షేర్ చేసారు. ఆ యాడ్ లో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ని జ్యోడి చేశారు యూనిట్. మహేష్ బాబు ‘మౌంటెన్ డ్యూ’ కూల్ డ్రింక్ కి బ్రాండ్ అంబాసడర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ బ్రాండ్ కి సంబంధించిన కొత్త యాడ్ ని మహేష్ ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఈ యాడ్ లోని యాక్షన్ సీన్స్ తో పాటు మహేష్ లుక్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

 

ఇక ఈ యాడ్ మహేష్ బాబు రాబోయే సినిమా పైన మరిన్ని అంచనాలను పెంచుతుంది. మహేష్ బాబు ఇంత హ్యాండ్ సమ్ లుక్స్ లో ఒక చిన్న యాడ్ లో కనిపిస్తేనే ఇలా ఉంది.. ఇక సినిమా మొత్తం ఇలా కనిపిస్తే ఎలా ఉంటుంది అంటూ అయన అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. కాగా కె ఎల్ నారాయణ, ఎస్ గోపాల్ రెడ్డి నిర్మిస్తున్న SSMB29 సినిమా ఇండియానా జోన్స్ తరహాలో అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నారు దర్శకుడు రాజమౌళి. ఈ సంవత్సరం మే నెలలో ఈ సినిమా గ్రాండ్ గా లాంచ్ కాబోతుందని సమాచారం.

Also Read: Ap Elections 2024: ఏపీలో 2014 పొత్తులు రిపీట్, ఎవరికెన్ని సీట్లంటే

Also Read: Indiramma Housing Scheme: ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు.. ఎప్పుడు.. ఎంతిస్తారంటే..?

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News