Manchu Vishnu: 120 మంది అనాథ పిల్లల దత్తత.. మరో షాకింగ్ నిజం బైటపెట్టిన మంచు విష్ణు..

Manchu Vishnu in news: మంచు విష్ణు ఇటీవల తిరుపతిలోని అనాథ శ్రమంలో నుంచి 120 మంది పిల్లల్ని దత్తత తీసుకున్నారు. అయితే.. ఈ విషయం గురించి మరో షాకింగ్ నిజాన్ని తాజాగా  వెల్లడించారు.   

Written by - Inamdar Paresh | Last Updated : Jan 14, 2025, 01:51 PM IST
  • ఆ తపన కోసం ఇదంతా అన్న విష్ణు..
  • మంచు ఫ్యామిలీకి నెట్టింట ప్రశంసలు..
Manchu Vishnu: 120 మంది అనాథ పిల్లల దత్తత.. మరో  షాకింగ్ నిజం బైటపెట్టిన మంచు విష్ణు..

Manchu Vishnu instapost: మంచు విష్ణు ఇటీవల తిరుపతిలోని  బైరాగిపట్టెడలోని మాతృశ్య  సంస్థకు చెందిన అనాథ శ్రమం నుంచి 120 మంది పిల్లల్ని దత్తత తీసుకున్నారు. వారి చదువులు,వైద్యం అంతా తానే భరిస్తానని వెల్లడించారు. అయితే.. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు సంక్రాంతి వేడుకల్ని.. తిరుపతిలో ఉన్న మోహన్ బాబు యూనివర్సీటీలో జరుపుకున్నారు.

ఈ నేపథ్యంలో మంచు విష్ణు మరో షాకింగ్ విషయంను ఇన్ స్టాలో పోస్ట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.. ఈ 120 మంది పిల్లల్ని.. ఏడాది క్రితమే దత్తత తీసుకున్నట్లు చెప్పారు. అప్పటి నుంచి వారి బాగోగులు అన్ని తానే చూసుకుంటున్నట్లు చెప్పారు. వారి చదువులు, వైద్యం తాను చూసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ అప్పట్లో తాను ఈ విషయం అందరితో చెప్పాలని అనుకోలేదని.. కానీ ఇప్పుడు తన  ఆలోచన మార్చుకున్నట్లు చెప్పారు.

ఇలాంటివి ప్రపంచానికి తెలిస్తే.. చాలా మంది తమ వంతుగా ఏదైన చేయాలనే తపన వారిలో కూడా కల్గుతుందనే భావనతనో.. ఈరోజు ఇన్ స్టా వేదికగా వెల్లడిస్తున్నట్లు చెప్పారు. నేనేమీ .. గొప్ప పనులు చేస్తున్నట్లు అనుకొవడంలేదని.. సమాజానికి నా వంతుగా తోచింది చేస్తున్నానని.. ఇది అందరిలో స్పూర్తిని నింపుతుందని మాత్రమే ఈరోజు నిజం రివిల్ చేసినట్లు కూడా మంచు విష్ణు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. ఈ పిల్లల చిరునవ్వులే తనకు ఆశీర్వాదాలన్నారు.

Read more: Actress Anshu Video: సైజులు పెంచాలన్న డైరెక్టర్.. షాకింగ్ వీడియో రిలీజ్ చేసిన హీరోయిన్ అన్షు.. ఏమన్నారంటే..?

ఈ పిల్లలు జీవితంలో ఉన్నత స్థానాలకు  ఎదిగి ఇంకొందరికి సాయంచేయాలని కొరుకుంటున్నట్లు మంచు విష్ణు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు.  ఇదిలా ఉండగా.. ఎప్పుడు వివాదాలు, గొడవలతో ఇటీవల వార్తలలో ఉంటున్న మంచు ఫ్యామిలీ మాత్రం.. అనాథ పిల్లల అంశం పుణ్యామా.. అని నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. మొత్తానికి మంచు విష్ణు చేసిన ట్విట్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News