Son of India: 'వారి మధ్య ముద్దు సీన్లు'.. మోహన్‌బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

Son of India: 'సన్ ఆఫ్  ఇండియా' చిత్రం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు నటుడు మోహన్‌బాబు. ఈ సినిమా ఈ నెల 18న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 13, 2022, 02:53 PM IST
Son of India: 'వారి మధ్య ముద్దు సీన్లు'.. మోహన్‌బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

Mohan Babu - Son of India: కలక్షన్ కింగ్ మోహన్‌బాబు హీరోగా నటించిన సినిమా 'సన్ ఆఫ్  ఇండియా' (Son of India). ఈ చిత్రానికి  డైమండ్‌ రత్నబాబు (Diamond Ratnababu) దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మీనా, ప్రజ్ఞా జైస్వాల్‌, శ్రీకాంత్‌, అలీ, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి నిర్మాత మంచు విష్ణు. అయితే ఈ మూవీకి  స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. ఇళయరాజా (Ilaiyaraaja) సంగీతమందించారు. ఈ నెల 18న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది ఈ చిత్రం. 

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు నటుడు మోహన్‌బాబు (Mohan Babu). 'చేయని తప్పుకు జైలుకు వెళ్లిన ఓ వ్యక్తి.. దేశవ్యాప్తంగా  తనలాంటి వారు ఇంకెవరెవరూ ఉన్నారనే పరిశోధన చేసి..చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడన్నదే సినిమా కథ' అని మోహన్‌బాబు అన్నారు. 

ఈ చిత్రంలో యువత కోరుకునే కొన్ని క్రేజీ సీన్స్ ఉన్నాయని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా కథ డిమాండ్ మేరకు ఇద్దరు మహిళలు ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం వంటి సీన్స్ కూడా ఉంటాయని మోహన్‌బాబు పేర్కొన్నారు. ఈ సన్నివేశాలు తీసివేయమని విష్ణు చెప్పినా..తాను వినలేదని తెలిపారు. నిజం చెప్పాలంటే.. ‘సన్నాఫ్ ఇండియా’ను ఓటీటీ కోసమే చేశామని.. కానీ కంటెంట్ నచ్చటంతో..థియేటర్లలో విడుదల చేస్తున్నామని ఆయన చెప్పారు. ఓటీటీని దృష్టిలో ఉంచుకుని ముద్దు సన్నివేశాలు కాస్తంత ఎక్కువే పెట్టినా.. థియేటర్లలో మాత్రం వాటి నిడివి తగ్గించామని మోహన్‌బాబు అన్నారు. 

Also Read: Kangana Ranaut: ఆ సినిమాలో స్కిన్​షో తప్ప ఏముంది.. Gehraiyaanపై కంగనా సంచలన వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News