Mohan Babu: 'రిపబ్లిక్' ప్రీరిలీజ్ కార్యక్రమం(Republic prerelease event) సందర్భంగా సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సీనియర్ నటుడు మోహన్‌బాబు(Mohan Babu) కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
‘‘'నా చిరకాల మిత్రుని సోదరుడైన పవన్‌కల్యాణ్ నువ్వు నాకంటే చిన్నవాడివి అందుకని ఏకవచనంతో సంభోదించాను. పవన్‌కల్యాణ్‌గారు అనడంలో కూడా తప్పేమీలేదు. చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్. సంతోషమే. ఇప్పుడు ‘మా’ ఎలక్షన్స్(MAA Elections 2021) జరుగుతున్నాయి. నా కుమారుడు విష్ణు(Manchu Vishnu) మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా నిలబడ్డాడన్న సంగతి మీకు తెలిసిందే. అక్టోబరు 10వ తేదీన ఎలక్షన్స్ అయిపోతాయి. ఆ తర్వాత నువ్వు అడిగిన ప్రతిమాటకీ నేను హృదయపూర్వకంగా సమాధానం చెబుతాను. ఈలోగా నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని.. నీ అమూల్యమైన ఓటును నీ సోదర సమానుడైన విష్ణుబాబుకి అతని ప్యానల్‌కి వేసి వాళ్లని గెలిపించాలని కోరుకుంటున్నా. థ్యాంక్యూ వెరీ మచ్'.. మోహన్‌బాబు(Mohan Babu) అని ట్వీట్ చేశారు.
To My Dear @PawanKalyan pic.twitter.com/xj1azU3v8B
— Mohan Babu M (@themohanbabu) September 26, 2021
Also Read: AP Government: ఆన్‌లైన్ టికెట్ పోర్టల్ అంటే పవన్‌కు అంత భయమెందుకు
పవన్‌కల్యాణ్ ఏమన్నారంటే?
‘రిపబ్లిక్’ ప్రీరిలీజ్ వేడుకలో పవన్‌కల్యాణ్(pawan kalyan) మాట్లాడుతూ.. ‘‘వైకాపా వాళ్లు థియేటర్‌లు మూసి వేస్తున్నప్పుడు మోహన్‌బాబుగారు కూడా మాట్లాడాలి. ఎందుకంటే ‘వైఎస్ కుటుంబీకులు మా బంధువులు’ అని మీరు చెబుతుంటారు కదా! నేను విన్నాను. చిత్ర పరిశ్రమను హింసించొద్దని వారికి చెప్పండి. కావాలంటే ‘పవన్‌కల్యాణ్‌ను బ్యాన్ చేసుకోండి. అతను, మీరూ తేల్చుకోండి’ అని చెప్పండి. మీరు పార్లమెంట్ మాజీ సభ్యులు. మాట్లాడాల్సిన నైతిక బాధ్యత మీకు ఉంది. ఈరోజు చిత్ర పరిశ్రమకు పెట్టిన నియమ, నిబంధనలు రేపు మీ విద్యానికేతన్‌కు కూడా పెట్టొచ్చు. కేవలం మోహన్‌బాబుగారికే కాదు, ప్రతి ఒక్కరికీ ఈ విషయం చెబుతున్నా’’ అని పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook