Naga Chaitanya: సమంతతో విడాకుల ఇష్యూపై నాగ చైతన్య సంచలన వ్యాఖ్యలు.. నేను విలన్ ను కాదంటూ..

Naga Chaitanya: సమంతతో విడాకుల విషయంపై నాగ చైతన్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తండేల్ సినిమా ప్రమోషన్ లో భాగంగా నాగ చైతన్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయంశంగా మారాయి. ఈ విషయంలో నేను విలన్ ను కాదంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 9, 2025, 08:14 AM IST
 Naga Chaitanya: సమంతతో విడాకుల ఇష్యూపై నాగ చైతన్య సంచలన వ్యాఖ్యలు.. నేను విలన్ ను కాదంటూ..

Naga Chaitanya: నాగ చైతన్య, సమంత 2017లో ఇరువరు కుటుంబ సభ్యులను ఒప్పించి గ్రాండ్ గా హిందూ, క్రిష్టియన్ పద్ధతుల్లో పెళ్లి చేసుకున్నారు. వీరి జంటకు ఏ దిష్టి తగిలిందో కానీ.. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఈ విషయంలో నాగ చైతన్య ఫ్యాన్స్  సమంతను తిట్టిపోయడం.. అటు సామ్ అభిమానులు చైతూను దోషిగా చూపెట్టడం వంటివి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి.  రీసెంట్ గా సమంత.. నాగ చైతన్య తన మొదటి మొగుడని సంభోదించకండి అంటూ ఒకింత మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు తండేల్ సినిమా సక్సస్ నేపథ్యంలో నాగ చైతన్య సామ్ తో విడాకులు అంశంపై స్పందించారు.

సమంతతో విడాకుల విషయంలో తనపై అనవసరంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తనపై లేనిపోని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని వాపోయారు. తనను ఒక నేరస్థుడిలా చూడడం తనకు తీవ్ర ఆవేదనను కలిగిస్తోందన్నారు. తాను విడిపోయిన కుటుంబం నుంచే వచ్చాను. తన అమ్మా నాన్నలు కూడా విడాకులు తీసుకున్న విషయాన్ని ప్రస్తావించారు.  విఫలమైన వివాహవ్యవస్థ ఎలా ఉంటుందో దాని పరిణామాలు ఎలా ఉంటాయో తనకు తెలుసన్నారు.

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

సమంతతో విడాకుల విషయంలో చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. విడాకుల అంశం ముగిసి ఏళ్లు గడుస్తున్నా  తనను ఇంకా దానిపై   ట్రోల్ చేస్తన్నారని మండిపడ్డాడు. సమంతతో విడాకుల అంశం ముగిసినా ప్రస్తుతం శోభిత కూడా దాని తాలూకూ ఎదురుదెబ్బలు ఎదుర్కొంటున్నారన్నారు నాగచైతన్య. నాగ చైతన్య నటించిన తండేల్ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తొలి రోజు రూ. 21 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ సినిమా రెండో ఓవరాల్ గా రూ. 35 కోట్ల గ్రాస్.. రూ. 15 కోట్ల షేర్ వరకు రాబట్టి మంచి హోల్డ్ చూపిస్తోంది. ఈ రోజు ఆదివారం కూడా ఈ సినిమాకు అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి. మరి ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అందుకుంటుందో వెయిట్ అండ్ సీ.

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News