Nagarjuna: చిరంజీవిని అదిరిపోయేలా ఇమిటేట్ చేసిన నాగార్జున..!

Chiranjeevi Nagarjuna: స్టార్ హీరోలు ఇద్దరు ఫ్రెండ్స్ కావడం అరుదుగా జరిగే విషయం. అయితే.. ఈ మాట వినగానే మనకు ముందుగా గుర్తొచ్చే ఇద్దరి పేర్లు.. చిరంజీవి, నాగార్జున. ఈ ఇద్దరు స్టార్ హీరోలు అయినప్పటికీ కూడా.. వీరి మధ్య ఎంతో అనుబంధం ఉంది. బిజినెస్ లో కూడా వీరిద్దరూ పార్టనర్స్ గా ఉంటూ ఉంటారు. ఇక ఇలాంటి ఇద్దరు స్టార్ హీరోలకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం తెలుగు వైరల్ అవుతోంది.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jan 15, 2025, 03:22 PM IST
Nagarjuna: చిరంజీవిని అదిరిపోయేలా ఇమిటేట్ చేసిన నాగార్జున..!

Nagarjuna Imitates Chiranjeevi: టాలీవుడ్‌లో చిరంజీవి, నాగార్జున మధ్య ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి కలిసి నటించిన రోజుల నుంచి ఈ బంధం ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున మధ్య స్నేహం సినీ ఇండస్ట్రీలో.. అందరికీ తెలిసిన విషయమే.

ఈ క్రమంలో.సతాజాగా, నాగార్జున ఒక జువెలరీ యాడ్‌లో చిరంజీవిని ఇమిటేట్ చేయడం.. సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారింది. ఈ యాడ్‌లో "ఖైదీ 150"లో చిరంజీవి చెప్పిన ప్రఖ్యాత డైలాగ్‌కు నాగార్జున పెదాలు కదిలిస్తూ మెగాస్టార్ స్టైల్‌ను తనదైన శైలిలో ప్రదర్శించారు. ఆయన చిరంజీవి మేనరిజంను కూడా భలేగా క్యాచ్ చేశారు.  

ఈ యాడ్‌లో కథనానికి అనుగుణంగా నాగార్జున భార్య చిరంజీవి అభిమాని పాత్రలో కనిపిస్తారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా, ఆమెకు జువెలరీ గిఫ్ట్ ఇచ్చిన నాగార్జున, ఆ తరువాత చిరంజీవి హిట్ సాంగ్ "మళ్లీ మళ్లీ ఇది రాని రోజు" పాటతో డ్యాన్స్ చేస్తారు. ఇక ఈ యాడ్‌లో చిరుని నాగ్ ఇమిటేట్ చేయడం హైలెట్. అంతేకాదు  ఖైదీ 150 సినిమాలో చిరంజీవి చెప్పిన డైలాగులు నాగార్జున చెబుతారు... "ఏదైనా సరే నాకు నచ్చితేనే చేస్తా.. నచ్చితేనే చూస్తా.. కాదని బలవంతం చేస్తే కోస్తా.." అంటూ వెనకాల చిరంజీవి డైలాగ్ వస్తుంటే నాగార్జున ముందు నుంచి.. లిప్ సింక్ ఇవ్వదమే కాకుండా ఆ డైలాగ్ ని మెగాస్టార్ స్టైల్ లో ప్రదర్శిస్తారు. 

ఇక ఈ సీన్స్ అన్నిటికీ ప్రస్తుతం అటు నాగార్జున ఫ్యాన్స్ ఇటు చిరంజీవి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
మెగాస్టార్ అభిమానులు ఈ యాడ్‌ను ప్రశంసిస్తూ.. సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. మరో పక్కన స్టార్ హీరో అయినప్పటికీ, చిరంజీవిని ఇమిటేట్ చేయడం పెద్ద విషయమని నెటిజన్లు అభినందిస్తున్నారు.  

ప్రస్తుతం నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న "కుబేర" అనే చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈ ఏడాది విడుదల కానుంది.

Read more: Naga Chaitanya - Sobhita: ఈ సంక్రాంతి శోభిత, నాగ చైతన్య దంపతులకు వెరీ వెరీ స్పెషల్.. పెళ్లి తర్వాత తొలి పండగ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News