Salaar: సలార్ స్టోరీ బయట పెట్టేసిన దర్శకుడు... కేజిఎఫ్ తో లింక్ గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు

Prabhas: ప్రస్తుతం ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న.. ఆయన అభిమానులు ఎక్కువ ఆశలు పెట్టుకో ఉన్న సినిమా మాత్రం సలార్. అందుకు ముఖ్య కారణం కేజిఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించడం. కాగా ఈ చిత్రం కథ గురించి అలానే ఈ సినిమాకి కేజిఎఫ్ కి మధ్య కనెక్షన్ ఉందా లేదా అనే దాని గురించి ఫైనల్ గా క్లారిటీ ఇచ్చేశారు ప్రశాంత్ నీల్.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 29, 2023, 09:13 AM IST
Salaar: సలార్ స్టోరీ బయట పెట్టేసిన దర్శకుడు... కేజిఎఫ్ తో లింక్ గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు

Prashanth Neel: తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాలలో ప్రభాస్ సలార్ ఒకటి. ఈ సినిమా ఆది పురుష్, రాధే శ్యామ్ లాంటి డిజాస్టర్స్ తరువాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా అయినా అంచనాలు మాత్రం భారీగా ఉన్నాయి. ఎందుకు ముఖ్య కారణం ఈ సినిమాని కే జి ఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తీయడమే. ఈసారి తప్పకుండా ప్రభాస్ బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ అందుకుంటారని డార్లింగ్ అభిమానులు కూడా గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమా గురించి అలానే ఈ సినిమా స్టోరీ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయిన ప్రశాంత్ నీలైకి .. సలార్ కథ ఏంటి..?  సలార్ కి ‘కేజీఎఫ్’తో కనెక్షన్ ఉందా..? అనే ప్రశ్నలు ఎదురవగా దానికి సమాధానం ఇచ్చేశారు ఈ దర్శకుడు. ముందుగా ఈ సినిమా కథ గురించి చెబుతూ ఈ చిత్రం ఫ్రెండ్ షిప్  చుట్టూ తిరుగుతుంది అని చెప్పుకొచ్చారు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ బిగ్ ఎనిమీస్ గా ఎలా మారారు అనేది ఈ సినిమా కథ అని చెప్పేశారు ప్రశాంత్. 

ప్రభాస్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తూ కేజీఎఫ్ లాగానే యాక్షన్ తో పాటు ఎమోషన్ కూడా ఈ సినిమాలో ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన మొదటి మూవీ ‘ఉగ్రం’ కథతోనే సలార్ సినిమా తెరకెక్కిస్తున్నారని చాలా రోజుల నుంచి ఒక వార్త చెక్కర్లు కొడుతోంది. ఇక ఎప్పుడు ప్రశాంత్ నీల్ సలార్ కథ గురించి చెప్పిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఇది నిజమే ఏమో అనిపిస్తుంది. కాగా ఉగ్రం కథలో ఫ్రెండ్స్ మధ్య పూర్తి స్థాయి శత్రుత్వం చూపించారు. మరి సలార్ లో ఏమన్నా మార్పులు చేస్తారేమో చూడాలి.

ఈ విషయం పక్కన పెడితే చాలా రోజుల నుంచి అందరిలో ఉన్న డౌట్ సలార్ కి కేజీఎఫ్ కి కనెక్షన్ ఉందా అని.. ఈ సందేహానికి ఫైనల్ గా ఆన్సర్ ఇచ్చేశారు ప్రశాంత్ నీల్. ఈ రెండు చిత్రాలకు ఏ కనెక్షన్ లేదని  చెప్పారు. అయితే ఈ పాయింట్ విన్న దగ్గర నుంచి మాత్రం అందరూ కొంచెం బాధగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లాగా ప్రశాంత్ యూనివర్స్ కూడా ఉంటుంది అని.. అందులో భాగంగా కేజిఎఫ్, సలార్ కనెక్షన్ ఉంటుంది అని అందరూ ఆశించారు.. కానీ ఇప్పుడు దర్శకుడే కనెక్షన్ లేదు అనడంతో అభిమానులకు కొంచెం నిరాశ ఎదురైంది.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

Also Read: Belly Fat: బెల్లీ ఫ్యాట్ లేదా అధిక బరువు సమస్య వేధిస్తోందా..ఈ 3 అలవాట్లు మానండి

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News