Prince Movie Report: కామెడీతో అన్ని సినిమాలూ జాతి రత్నాలు అవ్వలేవు బాసూ!

Prince Movie Report: జాతిరత్నాలు మూవీతో హిట్ అందుకున్న అనుదీప్ డైరెక్షన్లో శివ కార్తికేయన్ ప్రిన్స్ మూవీ చేశారు. అయితే జాతిరత్నాలు మూవీ తెచ్చుకున్నంత పాజిటివ్ టాక్ ప్రిన్స్ మూవీ అయితే తెచ్చుకోలేక పోయింది. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 21, 2022, 07:49 PM IST
Prince Movie Report: కామెడీతో అన్ని సినిమాలూ జాతి రత్నాలు అవ్వలేవు బాసూ!

Jathi Ratnalu Movie Vs Prince Movie: జాతి రత్నాల సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు అనుదీప్ కేవీ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ప్రిన్స్. శివ కార్తికేయన్ హీరోగా ఫారెన్ భామ మరియా హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమాలో సత్యరాజ్, ప్రేమ్ జీ అమరేన్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. రెండు దేశాలకు చెందిన యువతీ యువకుల మధ్య ప్రేమ పుడితే ఆ ప్రేమను వారు ఎలా సఫలం చేసుకున్నారనే విషయాన్ని తనదైన కామెడీ టైమింగ్ తో చూపించే ప్రయత్నం చేశాడు అనుదీప్.

అయితే జాతి రత్నం సినిమా కూడా దాదాపు అలాగే కామెడీ ఆధారంగా తీసిన సినిమానే. పూర్తిస్థాయిలో కథ, కథనం మీద ఎలాంటి దృష్టి పెట్టకుండా కామెడీతోనే బండి నడిపించడానికి ప్రయత్నించాడు. అయితే ఆ ప్రయత్నం దాదాపు సఫలం అయింది. తెలుగు ప్రేక్షకులందరికీ ఆ సినిమా బాగా నచ్చింది.  ఇప్పుడు దాదాపు అదే పద్ధతి ఫాలో అవుతూ ఈ ప్రిన్స్ సినిమాని కూడా తెరకెక్కించారు.

ఎలాంటి బాధ్యత, కామన్ సెన్స్ లేకుండా స్కూల్లో టీచరుగా పనిచేస్తున్న స్కూల్ కి వెళ్లకుండా సినిమాలు చూస్తూ గాలికి తిరిగే ఒక వ్యక్తి ఒక ఫారెన్ అమ్మాయి ప్రేమలో పడితే ఆమెను దక్కించుకోవడం కోసం ఏం చేశాడు? స్వాతంత్ర సమరయోధుల కుటుంబంలో పుట్టిన ఆ వ్యక్తి ఎవరి దగ్గర నుంచి అయితే స్వాతంత్రం తెచ్చుకోవాల్సి వచ్చిందో అదే దేశానికి చెందిన అమ్మాయి ప్రేమలో పడితే ఆమెను ఎలా దక్కించుకున్నాడు అనే విషయం మీద ఈ సినిమాను రూపొందించారు. సాధారణంగా కంటెంట్ లేకుండా కామెడీ చేయడం అంటే చిన్న విషయం కాదు అలా చేయడానికి చాలా టాలెంట్ ఉండాలి.

ప్రిన్స్ లో కూడా జాతిరత్నాలు ఆ రేంజ్  నవ్వులు లేకపోయినా.. దాదాపు అదే చేశాడు. చెప్పుకోవడానికి సీరియస్ కథలా ఉంటుంది కానీ దాన్ని కూడా ఎంటర్టైన్మెంట్ పద్ధతిలోనే డీల్ చేశాడు అనుదీప్. లాజిక్ ల కోసం వెతుక్కోకుండా కామెడీ ఎంజాయ్ చేస్తే ఈ సినిమా నచ్చుతుంది కానీ జాతి రత్నాలు సినిమాకి వర్కౌట్ అయినట్లుగా ఈ సినిమాకి కామెడీ వర్కౌట్ అవలేదు. ఒక మాటలో చెప్పాలంటే అన్ని సినిమాలు జాతిరత్నాలు అవ్వలేవు ఒక్కోసారి ఇలాంటి ఆణిముత్యాలు కూడా బయటకు వస్తాయనే మాట వినిపిస్తోంది. సినిమాలో అసలు ఏమాత్రం లాజిక్ లేదు, సినిమాని తెలుగు ఆడియోస్ కోసం తీసినట్లు కూడా ఏమాత్రం అనిపించదు తమిళ్ ఆడియన్స్ కోసం తీసి తెలుగు ప్రేక్షకులకు డబ్బింగ్ చేసి వదిలిన ఫీలింగ్ కలుగుతుంది.

Also Read: Aishwarya Rajesh Pics: టైట్ టీషర్ట్ అండ్ జీన్స్‌లో ఐశ్వర్య రాజేశ్.. తమిళ బ్యూటీ అందాలకు కుర్రకారు బోల్డ్!

Also Read: Samantha Ruth Prabhu Bold Pics : సమంత గ్లామర్ ఫోటోలు షేర్ చేసిన సాధన సింగ్.. సామ్ ఫ్రెండ్‌పై నెటిజన్ ఫైర్.. రిప్లై హైలెట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News