Rashmika Mandanna:‘'బేబీ'’ ప్రీమియర్ చూసి ఎమోషనల్ అయిన రష్మిక.. వీడియో వైరల్

Rashmika Mandanna:‘గురువారం రాత్రి హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమ్యాక్స్ లో 'బేబీ' సినిమా ప్రీమియర్ షో వేశారు. దీనికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలో బేబీ చిత్రాన్ని వీక్షించిన స్టార్ హీరోయిన్ రష్మిక భావోద్వేగానికి గురయ్యారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 14, 2023, 05:06 PM IST
Rashmika Mandanna:‘'బేబీ'’ ప్రీమియర్ చూసి ఎమోషనల్ అయిన రష్మిక.. వీడియో వైరల్

Rashmika on Baby Movie: ఆనంద్‌ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (vaishnavi chaitanya), విరాజ్‌ అశ్విన్‌ (Viraj Aswani) లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం 'బేబీ’'(Baby).  డైరెక్టర్ సాయి రాజేశ్ తెరకెక్కించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూత్‏ఫుల్ లవ్ ఎంటర్టైనర్‏గా వచ్చిన ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. అయితే గురువారం రాత్రి హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐమ్యాక్స్‌లో బేబీ ప్రీమియర్ షో వేశారు. ఇందులో విజయ్‌ దేవరకొండ, రష్మిక, రాశీ ఖన్నా, మారుతితోపాటు పలువురు పాల్గొని సందడి చేశారు. సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన రష్మిక  కాస్త ఎమోషనల్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

'బేబీ' సినిమా చూసిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘‘''సాయి రాజేశ్, ఎస్కేఎన్ లను చూస్తే తనకేంతో గర్వంగా ఉంది. మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారు. వైష్ణవి.. తన నటనతో ఏడిపించేసింది. ఆనంద్‌, విరాజ్‌ అద్భుతంగా చేశారు. చిత్రయూనిట్ విషయంలో గర్వపడుతున్నా. త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని విషయాలు పంచుకుంటానని'' విజయ్ చెప్పాడు చెప్పారు. హీరోయిన్ రాశిఖన్నా సైతం ఈ సినిమా చూసి ఎమోషనల్ అయ్యారు. మూవీ సూపర్ గా ఉందని.. తన స్కూల్ డేస్ గుర్తుకు వచ్చాయని రాశిఖన్నా చెప్పుకొచ్చింది. మరోవైపు బేబీ మూవీ యూనిట్ కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా తనకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదని అన్నారు హీరో అనంద్ దేవరకొండ. 

Also Read: SS Rajamouli-Mahesh Babu: మహేష్-రాజమౌళి సినిమాలో ముగ్గురు బాలీవుడ్ హీరోయిన్స్?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News