Mumbai bandra police conduct identification parade: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ బాంద్రాలోని ఇంట్లో జన్వరి 16న షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తెల్లవారు జామున రెండు గంటల ప్రాంతంలో దుండగుడు మెట్ల మీద నుంచి వచ్చి సైఫ్ కొడుకు గదిలోకి ప్రవేశించాడు. అక్కడున్న కేర్ టేకర్ అరుపులు పెట్టడంతో సైఫ్ అక్కడికి చేరుకున్నాడు.దీంతో వారి మధ్య తోపులాట జరిగి కత్తిపోట్లు చోటు చేసుకున్నాయి.
ఈ క్రమంలో.. ఆగంతకుడు సైఫ్ ను పలు మార్లు కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే సైఫ్ కొడుకు ఆటోలో లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు రెండు సర్జరీలు చేశారు . వెన్నుపాములో ఉన్న కత్తిని వైద్యులు తొలగించారు. దీంతో సైఫ్ ప్రాణాపాయం నుంచి బైటపడ్డాడు. అయితే.. ముంబై పోలీసులు సీసీ ఫుటేజీలను జల్లెడ పట్టారు. ఈ క్రమంలో ముంబైలోని మహమ్మద్ షరీపూల్ ఇస్లాం షెహజాద్ ను అదుపులోకి తీసుకున్నారు.
కోర్టులో హజరు పర్చగా కోర్టు రిమాండ్ విధించింది. ఇటీవల పోలీసులు ఆర్థర్ జైలులో ఐడెంటీఫికేషన్ పరేడ్ ను ఏర్పాటు చేశారు. దీనిలో సైఫ్ ఇంట్లోని సిబ్బంది ఆ రోజు దాడికి పాల్పడింది మహమ్మద్ షరీపూల్ ఇస్లాం షెహజాద్.. అని తెల్చి చెప్పారు.
Read more:Shrasti Verma: శేఖర్ బాషాకు బిగ్ షాక్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన కొరియోగ్రాఫర్ శ్రేష్టివర్మ..
రాత్రి పూట మహమ్మద్ షరీపూల్ ఇస్లాం షెహజాద్ ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులకు చెప్పారు. దీంతో సైఫ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకొవచ్చు. మరోవైపు ఈ ఘటనలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. సైఫ్ ఇంటి చుట్టుపక్కల భద్రతను కట్టుదిట్టం చేశారు. సైఫ్ తన ఇంట్లోకి ఇతరులు రాకుండా ప్రైవేటు సెక్యురీటీని సైతం ఏర్పాటు చేసుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter