RGV Comments: 30 ఏళ్లలో ఇలాంటి సినిమా చూడలేదంటున్న ఆర్జీవీ

RGV Comments: ఆర్ఆర్ఆర్ సినిమాపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ సినిమా చూసి..నోట మాట రావడం లేదంటున్నాడు ఆర్జీవీ. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 28, 2022, 03:40 PM IST
RGV Comments: 30 ఏళ్లలో ఇలాంటి సినిమా చూడలేదంటున్న ఆర్జీవీ

RGV Comments: ఆర్ఆర్ఆర్ సినిమాపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ సినిమా చూసి..నోట మాట రావడం లేదంటున్నాడు ఆర్జీవీ. 

ఆర్ ఆర్ ఆర్ సినిమా చూసి మాటలు కరువయ్యాయంటున్నాడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఏ విషయంపైనైనా ఫుల్ క్లారిటీతో మాట్లాడే తనకు.. జీవితంలో మొదటి సారి మాటలు రావడం లేదన్నాడు వర్మ. రాజకీయాలైనా, సినిమాలైనా తన అభిప్రాయం మొహమాటం లేకుండా కుండబద్ధలు కొట్టేసే వర్మ.. తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఆర్ఆర్ఆర్ అద్భుతంగా ఉందని.. ఇలాంటి గొప్ప చిత్రాన్ని తెరకెక్కించిన రాజమౌళిని అభినందిస్తున్నానన్నాడు. 

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తనలోని చిన్నపిల్లాడిని బయటపెట్టిందన్నాడు ఆర్జీవీ.ఫేమస్‌, స్టేటస్‌.. ఇలా అన్నీ మర్చిపోయి ప్రతి సన్నివేశాన్ని మనస్ఫూర్తిగా ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తూ సినిమా చూశానన్నాడు.ట్రైలర్‌ చూసినప్పుడు సినిమా బాగుంటుందని భావించా కానీ, సినిమా చూశాక ఇదొక అద్భుతమైన చిత్రమని తెలిసిందన్నాడు. ఏం చెప్పాలో అర్థం కావడం లేదని.. మాటలు కరువయ్యాయని అన్నాడు. ఆర్ఆర్ఆర్ చూశాక జీవితంలో మొదటిసారి ఏం మాట్లాడాలో తెలియడం లేదని చెప్పాడు వర్మ.

కథేంటి? పాత్రలు ఎవరు? అనే విషయాన్ని పక్కనపెడితే కథ చెప్పిన విధానం, విజువల్‌గా స్క్రీన్‌పై చూపించిన తీరు ఎంతగానో ఆకట్టుకుందట. ప్రతి సీన్‌లో ఇద్దరూ ఎవరికి వారే అదరగొట్టేశారని వర్మ కితాబిచ్చాడు. గడిచిన 30 ఏళ్లలో ఇంతలా ఏ చిత్రాన్ని ఎంజాయ్ చేయలేదంట. రాజమౌళీ.. నువ్వు ప్రేక్షకులకు దొరికిన బంగారం అంటూ ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రేక్షకుల కోసమే పుట్టావు. నీలాంటి వ్యక్తి ఈ భూమ్మీదకు వచ్చి.. సినిమానే కలగా చేసుకుని.. దర్శకుడిగా మంచి చిత్రాలు తెరకెక్కిస్తున్నందుకు సినీ ప్రియులందరూ ఎంతో ఆనందిస్తున్నారని జక్కన్నను అభినందించాడు.

Also read: Lakme Fashion Show: లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ షోతో అదరగొట్టిన ఎంపీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News