Game Changer: గేమ్ చేంజెర్ సినిమా తనకే నచ్చలేదు అని చెప్పేసిన శంకర్..!

Sankranthi 2025 movies winner: సంక్రాంతి సందర్భంగా తెలుగులో మూడు సినిమాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో బాలకృష్ణ సినిమా డాకూ మహారాజా అలానే వెంకటేష్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం మంచి టాక్ తో దూసుకుపోతుండగా.. రామ్ చరణ్ హీరోగా వచ్చిన గేమ్ చేంజ్ర్ చిత్రం మాత్రం దిజాస్టర్ గా మిగిలింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు ఈ చిత్ర దర్శకులు శంకర్. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jan 15, 2025, 03:14 PM IST
Game Changer: గేమ్ చేంజెర్ సినిమా తనకే నచ్చలేదు అని చెప్పేసిన శంకర్..!

Shankar About Game Changer: ఒకప్పుడు దర్శకుడు శంకర్ అంటే.. ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎంతగానో ఇష్టపడేవారు. పాన్ ఇండియా సినిమా అంటే ఏమిటో తెలియక ముందే.. ఈ దర్శకులు తీసిన చిత్రాలు నేషనల్ లెవెల్ లో అన్ని భాషల వారిని అలరించేవి. అయితే ప్రస్తుతం మాత్రం ఈ డైరెక్టర్ టైం బాగోలేదు. 

శంకర్ ఈ మధ్య తీసిన సినిమాలు అన్నీ కూడా అపజయాలు చవిచూశాయి. నిజంగా రోబో, శివాజీ తర్వాత శంకర్ తీసిన ఏ సినిమా కూడా విజయం సాధించలేదు. కాగా ఈ మధ్య కమల్ హాసన్ తో శంకర్ తీసిన ఇండియన్ 2 సినిమా ఘోరపరాజయం చవిచూసింది. ఇక సంక్రాంతి సందర్భంగా వచ్చిన..గేమ్ చేంజెర్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. 

ఈ చిత్రం షూటింగ్ దాదాపు ఐదేళ్లు తీసిన శంకర్.. ఇప్పుడు ఈ సినిమా తనకే నచ్చలేదు అంటూ ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ వదిలారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడొచ్చు శంకర్ ఈ చిత్రం.. తనకు సంతృప్తిని ఇవ్వలేదని తెలియజేశారు.

"గేమ్‌ ఛేంజర్‌ చిత్రం ఔట్‌పుట్‌తో.. నేను సంతృప్తిగా లేను. ఇంతకంటే.. ఈ సినిమా బాగా చేసుండాల్సింది. నేను అనుకున్న దాని ప్రకారం ఈ సినిమా నిడివి.. దాదాపు 5 గంటల వరకు ఉండాలి. సమయాభావం వల్ల.. చాలా సీన్స్‌ ట్రిమ్ చేయాల్సి వచ్చింది. దీంతో ఈ చిత్ర కథ నేను అనుకున్న విధంగా రాలేదు" అంటూ శంకర్ చెప్పారు.

కాగా రామ్‌ చరణ్‌, ఎస్‌జే సూర్యలు.. మాత్రం చాలా బాగా నటించారని.. శంకర్ ప్రశంసించారు. ఈ చిత్రం గురించి సోషల్ మీడియాలో వచ్చిన రివ్యూలు తాను చూడలేదని.. మంచి రివ్యూలు వచ్చినట్లు మాత్రం తాను విన్నానన్నారు. కాగా ఇప్పటికే చాలా దగ్గరలో ఈ సినిమా కలెక్షన్స్ పడిపోయిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత..అసలు రామ్ చరణ్ తన కెరీర్‌లో పీక్ టైమ్‌ని శంకర్‌కి ఇస్తే.. చివరకు ఈ దర్శకుడు ఇలాంటి సినిమా తీశారంటూ మెగా అభిమానుల సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా జరగాల్సిన నష్టం జరిగాక దర్శకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలో లాభమేముంది అంటూ ఎంతోమంది నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

ఇదీ చదవండి: Prabhas Marriage: ప్రభాస్ మ్యారేజ్ ఫిక్స్.. డార్లింగ్ చేసుకోబోయేది ఈమెనే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News