Boney kapoor interesting comments on allu arjun: పుష్ప2 ప్రీమియర్ షో నేపథ్యంలో జరిగిన తొక్కిసలాట ఘటన దేశంలోనే పెను దుమారంగా మారిన విషయం తెలిసిందే.ఈ ఘటన ఒకవైపు రాజకీయంగాను, మరోవైపు ఇండస్ట్రీలో కూడా చర్చనీయాంశంగా మారింది. డిసెంబరు 4న జరిగిన ఈ ఘటనలో పోలీసులు మొత్తం 18 మందిపై కేసుల్ని నమోదు చేసినట్లు తెలుస్తొంది. అంతే కాకుండా.. ఈ ఘటనలో అల్లు అర్జున్ ఏ11 గా చేర్చారు.
ఈ ఘటనలో అల్లు అర్జున్ ప్రస్తుతం మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు. పుష్ప2 సినిమా తొక్కిసలాట పొలిటికల్ టర్న్ కూడా తీసుకున్నట్లు తెలుస్తొంది. బీజేపీ, బీఆర్ఎస్ లు మాత్రం.. అల్లు అర్జున్ కు సపోర్ట్ చేసినట్లు తెలుస్తొంది. అనుకొకుండా జరిగిన ఘటన అంటూ మాట్లాడారు. అదే విధంగా ఒక మహిళ చనిపోవడం, కుమారుడు శ్రీతేజ్ వెంటిలెటర్ మీద ఉండటం మాత్రం బాధకరమన్నారు.
అయితే. ఈ ఘటన మాత్రం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పుష్ప 2 రికార్డులు ఏవిధంగా వార్తలలో నిలిచిందో.. ఈ వివాదం కూడా ప్రతిరోజు ఏదో రకంగా వార్తలలో నిలిచింది. తాజాగా.. ఈ ఘటనపైశ్రీదేవీ భర్త బోనీకపూర్ స్పందించారు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో అల్లు అర్జున్ ను తప్పులేదని అన్నారు. అది అనుకొకుండా జరిగిన ఘటన అన్నారు.
సౌత్ లో హీరో, హీరోయిన్ లకు అభిమానులు ఎక్కువగా ఉంటారని.. అదే విధంగా మెగాస్టార్ , రజనీకాంత్ , మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లను దగ్గరగా చూసేందుకు అభిమానులు ప్రయత్నిస్తారని అన్నారు.
Read more: Actress Hema: బెంగళూరు డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. నటిహేమ కేసులో కీలక ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు..
ఈ క్రమంలో అనుకొకుండా.. జరిగిన ఘటన అని.. దీన్ని పూర్తిగా అల్లు అర్జున్ దే తప్పన్నట్లు ఆపాదించాల్సిన అవసరం లేదని బోనీకపూర్ అన్నారు. అయితే.. బోనీ కపూర్ ఇటీవలే.. జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీకి కొత్త ఫెస్ అని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం కొంత వరకు వివాదంగా మారాయి. అదే విధంగా దీనిపై నాగవంశీ బోనీ కపూర్ కు కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter