Swara Bhaskar Marriage: సీక్రెట్‌గా పెళ్లిచేసుకున్న వివాదాస్పద హీరోయిన్‌.. ఏకంగా పొలిటికల్‌ లీడర్‌తో!

Swara Bhasker registered her wedding with Samajwadi Party Leader Fahad Ahmad. బాలీవుడ్‌ హీరోయిన్‌ స్వర భాస్కర్‌ పెళ్లి చేసుకున్నారు. తన స్నేహితుడు ఫహద్‌ అహ్మద్‌ను ఆమె సీక్రెట్‌గా వివాహమాడారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Feb 16, 2023, 08:14 PM IST
  • సీక్రెట్‌గా పెళ్లిచేసుకున్న హీరోయిన్‌
  • ఏకంగా పొలిటికల్‌ లీడర్‌తో
  • పెళ్లి ఫొటోస్ చూసిన అందరూ షాక్
Swara Bhaskar Marriage: సీక్రెట్‌గా పెళ్లిచేసుకున్న వివాదాస్పద హీరోయిన్‌.. ఏకంగా పొలిటికల్‌ లీడర్‌తో!

Actor Swara Bhasker married Samajwadi Party Leader Fahad Ahmed: బాలీవుడ్‌ హీరోయిన్‌, వివాదాస్పద నటి స్వర భాస్కర్‌ పెళ్లి చేసుకున్నారు. తన స్నేహితుడు ఫహద్‌ అహ్మద్‌ను ఆమె సీక్రెట్‌గా వివాహమాడారు. 2023 జనవరి 6న స్వర భాస్కర్‌, ఫహద్‌ అహ్మద్‌ పెళ్లి జరిగింది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన పెళ్లి విషయాన్ని స్వర స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా నేడు ప్రకటించారు. దాంతో స్వర పోస్ట్, పెళ్లి ఫొటోస్ చూసిన అందరూ షాక్ అవుతున్నారు. 

స్వర భాస్కర్‌, ఫహద్‌ అహ్మద్‌ దండలు మార్చుకున్న ఫొటోలను బాలీవుడ్‌ హీరోయిన్‌ స్వర తన ట్విట్టర్‌ ఖాతాలో నేడు షేర్‌ చేశారు. ఫహద్‌ అహ్మద్‌తో ఏర్పడిన పరిచయం నుంచి పెళ్లి వరకు సాగిన జర్నీని 2 నిమిషాల 5 సెకండ్ల వీడియో ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. కొన్ని రోజుల క్రితం ఓ యువకుడి చేతుల్లో తల పెట్టి కూర్చున్న ఫొటోను స్వర షేర్ చేశారు. ఈ ఫొటోలో ఉన్న యువకుడు ఎవరా అని అందరూ తలలు పట్టుకున్నారు. ఆ ఫొటోలో ఉన్న యువకుడు ఎవరో ఇప్పుడు స్పష్టంగా తెలిసిపోయింది. అతడు మరెవరో కాదు 'ఫహద్ అహ్మద్‌'. 

రచయిత హిమాన్షు శర్మతో స్వర భాస్కర్ డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వీరిద్దరికి 'రంఝానా' సెట్స్‌లో పరిచయం అయింది. ఆ పరిచయం స్నేహంగా, ఆపై ప్రేమగా మారింది. దాదాపు ఐదేళ్లు డేటింగ్ చేసిన అనంతరం 2019లో వీరిద్దరూ విడిపోయినట్లు నెట్టింట వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు సమాజ్‌వాదీ పార్టీ యువజన విభాగం నాయకుడు ఫహాద్‌ అహ్మద్‌ను వివాహం చేసుకుని అందరికి భారీ షాక్ ఇచ్చారు. మహారాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడిగా ఫహాద్‌ ఉన్నారు.

తను వెడ్స్ మను, రాంఝానా, వీరే ది వెడ్డింగ్, జహాన్‌ చార్‌ యార్‌ సినిమాలతో స్వర భాస్కర్ పాపులర్ అయ్యారు. రాస్భరీ అనే వెబ్‌ సిరీస్‌లో కూడా ఆమె నటించి మెప్పించారు. స్వర తాజాగా నటించిన 'మీమాంస' విడుదలకు సిద్ధంగా ఉంది. 'మిసెస్‌ ఫలానీ' సినిమా నిర్మాణ దశలో ఉంది. స్వర భాస్కర్ సినిమాల అంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటారు. నిర్మోహమాటంగా తన అభిప్రాయాలు చెప్పే స్వర నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంటారు. 

Also Read: Albino Cobra Viral Video: రేర్ అల్బినో కోబ్రా.. చూస్తేనే వణుకుపుడుతుంది! ఈ వ్యక్తి ఎంత ఈజీగా పట్టాడో 

Also Read: Best Gaming SmartPhones: బెస్ట్ గేమింగ్ 4 స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. ధర తక్కువ, ఫీచర్స్ ఎక్కువ! ఇక ఆలస్యం ఎందుకు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News