Kamal Haasan Health: నటుడు కమల్ హాసన్ కు తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైంది. ఇటీవలే కరోనా వైరస్ (Kamal Haasan Corona) బారిన పడిన ఆయన రెండు రోజుల క్రితం కోలుకున్నారు.
అయితే ఈ క్రమంలో కమల్ హాసన్.. కరోనా నిబంధనలను ఉల్లంఘించారని తమిళనాడుకు చెందిన కొందరు ఆరోగ్య అధికారులు అంటున్నారు. దీంతో కమల్ కు త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నారని తెలుస్తోంది.
ఏం జరిగిందంటే?
గత నెలలో కరోనా వైరస్ బారిన పడిన కమల్ హాసన్.. వెంటనే ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల కిందట కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అయితే, కరోనా నిబంధనల ప్రకారం.. మహామ్మారి నుంచి కోలుకున్నా ఇంట్లో కనీసం వారం రోజులు ఐసోలేషన్‌లో ఉండాలి.
కానీ, కమల్.. కరోనా నిబంధనలు ఉల్లంఘించి బిగ్‌బాస్ షో షూటింగ్లో పాల్గొన్నారు. తమిళ వెర్షన్ బిగ్‌బాస్‌కు కమల్ వ్యాఖ్యాత వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. దీంతో బిగ్‌బాస్ వీకెండ్ (Bigg Boss Tamil Season 5) స్పెషల్ షో కోసం ఆయన ఆస్పత్రి నుంచి నేరుగా షూటింగ్‌కి వెళ్లారు.
కరోనా నుంచి కోలుకున్న వెంటనే కమల్ హాసన్ బిగ్‌బాస్ షూటింగ్లో పాల్గొనడంపై తమిళనాడు ఆరోగ్యశాఖ సీరియస్ అయింది.
కరోనా నిబంధనలు (Kamal Haasan Corona) ఉల్లంఘించి కమల్ షూటింగ్ చేయడం సరికాదని, ఈ చర్యపై తక్షణమే వివరణ ఇవ్వాలని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ నోటీసులు జారీ చేయనుందని అధికారులు మీడియాకు వెల్లడించారు.
ALso Read: Pushpa trailer: Allu Arjun స్టామినా ఏంటో చెప్పేలా పుష్ప ట్రైలర్.. తగ్గేదేలె
ALso Read: Katrina Kaif and Vicky Kaushal wedding: కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌పై ఫిర్యాదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook