Vanitha Vijaykumar: నటి వనిత నాలుగో పెళ్లి.. అసలు నిజం బైటపెట్టిన తమిళ భామ.. ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటీ భయ్యా..

Vanitha vijaya kumar wedding rumours: వనితా విజయ్ కుమార్ నాలుగవ పెళ్లికి రెడీ అయిపోయారని రూమర్స్ ఒక రేంజ్ లో సినిమా ఇండస్ట్రీని కుదిపేశాయి. ఈ నేపథ్యంలో ఆమె అందర్ని ఒక్కసారిగా షాకింగ్ కు గురిచేస్తే ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఇప్పుడిది వార్తలలో నిలిచింది.

Written by - Inamdar Paresh | Last Updated : Oct 5, 2024, 04:21 PM IST
  • మరో ట్విస్ట్ ఇచ్చిన వనితా విజయ్ కుమార్..
  • తిట్టిపోస్తున్న నెటిజన్ లు..
Vanitha Vijaykumar: నటి వనిత నాలుగో పెళ్లి..  అసలు నిజం బైటపెట్టిన తమిళ భామ.. ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటీ భయ్యా..

Vanitha Vijaykumar clarity on fourth marriage rumours: తమిళ నటి వనితా విజయ్ కుమార్ ఇటీవల వార్తలలో ట్రెండింగ్ గా మారారు. ఆమె ఇప్పటికే ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో స్టార్ డమ్ సాధించారు.  అదే విధంగా ఆమె వ్యక్తిగత అంశాల పరంగా వివాదాస్పదంగా కూడా మారారు. ఈ క్రమంలో ఈ తమిళ భామ..  ఇప్పటికే ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకుని, ముగ్గురికి సైతం డైవర్స్ ఇచ్చేశారు. అంతేకాకుండా ఇటీవల ఒక కొరియోగ్రాఫర్ తో పెళ్లికి రెడీ అన్నవిధంగా బీచ్ లో ఫోటోలు దిగుతూ రచ్చచేశారు.ఇవి కాస్త వైరల్ గా మారాయి.

 

మెయిన్ గా సినిమా కంటే.. ఆమె వ్యక్తిగత వివాదాస్పద అంశాలతోనే ఎక్కువగా ట్రెండింగ్ లో ఉండే ఈ నటి.. ఒక్కసారిగా మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఆమె గత కొన్నేళ్లుగా.. కొరియోగ్రాఫర్ రాబర్ట్‌తో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు రచ్చగా మారాయి. మరోసారి ఆమె నాలుగో పెళ్లికి రెడీ అయిపోయినట్లు కూడా అనేక రూమర్స్ వైరల్గా మారాయి. ఈ నేపథ్యంలో వనితా విజయ్ కుమార్ అందర్ని పిచ్చిపుష్ఫాలు చేసినట్లు తెలుస్తోంది.  ఆమె..ఇటీవల  రాబర్ట్‌కి ప్రపోజ్ చేస్తున్నట్లు ఉన్న ఒక ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాకుండా... ‘అక్టోబరు 5వ తేదీని గుర్తుంచుకోండి’ అని క్రేజీ క్యాప్షన్ కూడా పెట్టింది.

ఇంకేముందీ..  వనిత నాలుగు పెళ్లికి రెడీ అయిపోయిందని ఫిక్స్ అయిపోయారని అందరు భావించారు. కానీ అనూహ్యంగా ఆమె మరోసారి  ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.  ఇదంతా సినిమా స్టంట్ అని అని రాసుకొచ్చారు. ప్రస్తుతం.. ‘మిసెస్ & మిస్టర్’ లో నటిస్తున్నారు. ఈ మూవీలో వనితాతోపాటు,ఆమెతో పాటు రాబర్ట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. స్వయంగా వనితనే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నటి కూతురు జోవికా నిర్మాతగా ఉంది.

Read more: Sobhita Dhulipala: నా పిల్లలకు వాళ్ల గురించి చెబుతా.. మరోసారి బాంబు పేల్చిన శోభితా ధూళిపాళ..

శనివారం (అక్టోబర్ 05) వనితా విజయ కుమార్ పుట్టిన రోజు. అందుకే... ఈ సందర్భంగానే మిసెస్ అండ్ మిస్టర్ సినిమాకు సంబంధించి అప్డేట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిని చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇదంతా తమ కొత్త మూవీ కోసం చేసిన ప్రమోషనల్ స్టంట్ అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ఇంకొందరు నెటిజన్లు వనితపై మాత్రం తమదైన స్టైల్ లో కామెంట్ లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల నాగచైతన్యకు కాబోయే సతీమణి సైతం.. ప్రెగ్నెంట్ అంటూ రూమర్స్ వచ్చాయి. అయితే.. అది ఒక సినిమాలో ప్రమోషన్ కొసం, అందులో ఆమె పాత్రకు చెందిన ఫోటో అంటూ ఆ తర్వాత తెలసి చాాలా మంది షాక్ కు గురయ్యారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News