Vijay Antony 25 - Parashakthi: ఢిఫరెంట్ కాన్సెప్ట్ తో విజయ్ ఆంటోని 25వ సినిమా.. పరాశక్తి టైటిల్ తో సినిమా పై పెరిగిన అంచనాలు..

Vijay Antony 25 -  Parashakthi:తమిళంలో విభిన్న కథా చిత్రాలతో అట్రాక్ట్ చేస్తున్నాడు విజయ్ ఆంటోని.  అంతేకాదు ఎప్పటికప్పుడు ప్రేక్షకుల అభిరుచి అనుగుణంగా సినిమా చేస్తున్నాడు. తాజాగా తన కెరీర్ లో మైల్ స్టోన్ 25వ మూవీతో పలకరించబోతున్నాడు. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమా పై ఆసక్తి రేకిస్తున్నాడు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 30, 2025, 12:55 AM IST
Vijay Antony 25 -  Parashakthi: ఢిఫరెంట్ కాన్సెప్ట్ తో విజయ్ ఆంటోని 25వ సినిమా.. పరాశక్తి టైటిల్ తో సినిమా పై పెరిగిన అంచనాలు..

Vijay Antony 25 -  Parashakthi: తమిళంతో పాటు తెలుగులో తన సినిమాలతో అలరిస్తున్నారు విజయ్ ఆంటోని. ఈ క్రమంలో హీరోగా 24 చిత్రాలు పూర్తి చేసుకొని 25వ చిత్రంతో పలకరించబోతున్నాడు. తాజాగా తన 25వ చిత్రం ‘పరాశక్తి’ మూవీతో పలకరించబోతున్నాడు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘అరువు’, ‘వాజిల్’ వంటి  చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు, రచయిత అరుణ్ ప్రభు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు.
ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ ఇప్పటి వరకు తన కెరీర్ లో చేయనటువంటి డిఫరెంట్ యాక్టింగ్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనున్నాడు.

తాజాగా ఈ చిత్ర టైటిల్ పోస్టర్ మరింత ఆకట్టుకునే విధంగా ఉంది. అంతేకాదు ఈ మూవీ ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.  పరాశక్తి ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని అందించేందుకు మాస్ అప్పీల్, యాక్షన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. అంతేకాదు ఈ సినిమాలో ఫ్యామిలీ ప్రేక్షకులు మెచ్చే సెంటిమెంట్ సీన్స్ కూడా అలరించనున్నట్టు చెప్పుకొచ్చారు.

‘పరాశక్తి’ చిత్రాన్ని విజయ్ ఆంటోనీ ఫిల్మ్స్ కార్పొరేషన్ బ్యానర్‌పై  మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో రానుంది. ఈ సినిమా గ్రాండ్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే విశ్వాసం  వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో విజయ్ ఆంటోనితో పాటు వాగై చంద్రశేఖర్, సునిల్ కృష్ణ, సెల్ మురుగన్, త్రుప్తి రవీంద్ర, మాస్టర్ కేశవ్ వంటి ప్రతిభావంతమైన నటీనటులు ఈ సినిమాలో నటించారు.   

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

టెక్నికల్ పరంగా  సినిమాటోగ్రఫీని షెల్లీ కాలిస్ట్ అందించారు.  ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీ సంగీతం అందించడం విశేషం.   రేమండ్ డెరిక్ క్రస్టా ఎడిటింగ్ చేస్తున్నారు.  రాజశేఖర్ యాక్షన్ కొరియోగ్రఫీ అందించారు. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ యేడాది వేసవిగా కానుకగా విడుదల కానుంది.

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News