Prabhas Remuneration for Kannappa : కన్నప్ప అనేది భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న పాన్-వరల్డ్ సినిమా. ఈ చిత్రం రూ. 140 కోట్ల ఖర్చుతో రూపొందుతోంది. విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి.. ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 25, 2025న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది.
తాజాగా ది హాలీవుడ్ రిపోర్టర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణు మంచు ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా ప్రభాస్, మోహన్‌లాల్‌ల గురించి మాట్లాడుతూ, ఇద్దరూ తన తండ్రి డా. మోహన్ బాబుపై ఉన్న గౌరవం, అభిమానం వల్లే ఈ చిత్రంలో నటించారని చెప్పారు.
అయితే వీరి రెమ్యునరేషన్ గురించి ప్రశ్నించగా, ప్రభాస్, మోహన్‌లాల్ ఎలాంటి పారితోషికం తీసుకోలేదని విష్ణు వెల్లడించారు. మోహన్‌లాల్‌తో జరిగిన సంభాషణను గుర్తు చేసుకుంటూ, తన పారితోషికం గురించి ప్రశ్నించినప్పుడు ఆయన నవ్వుతూ, "ఇప్పుడు నువ్వు అంత పెద్దవాడివైపోయావా?" అని ప్రశ్నించారని చెప్పారు. ఇది మోహన్‌లాల్, ప్రభాస్‌ల నిజమైన వినయం, సరళతను ప్రతిబింబిస్తున్నట్లు చెప్పారు.
ఈ సినిమాలో ప్రభాస్ రుద్ర పాత్రలో, మోహన్‌లాల్ కిరాత పాత్రలో కనిపించనున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఆవా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై రూపొందుతున్న ఈ మైథలాజికల్ ఎపిక్‌లో మోహన్ బాబు, అక్షయ్ కుమార్, శరత్‌కుమార్, అర్పిత్ రాంకా, కాజల్ అగర్వాల్, ప్రీతి ముఖుందన్, విష్ణు మంచు కుమార్తెలు అరియానా, వివియానా మంచు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
కాగా ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కల్కి 2, సలార్ 2, స్పిరిట్, ది రాజా సాబ్.. ఇలా ఎన్నో చిత్రాలు త్వరగా ప్రభాస్ నుంచి రానున్నాయి. మరోపక్క మోహన్ లాల్ కూడా వరుస సినిమాలో చేస్తూ బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలో వీరిద్దరూ కూడా రెమ్యూనరేషన్.. తీసుకోకుండా మంచు విష్ణు సినిమాలో నటించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాదు చాలామంది వీరిద్దరికి విష్ణుతో, మోహన్ బాబుతో ఉన్న స్నేహం గురించి కామెంట్ లో చేస్తూ అభినందిస్తున్నారు.
Read more: Kalvakuntla Kavitha: 'తెలంగాణలోని ప్రతి మహిళకు రేవంత్ రెడ్డి రూ.35 వేలు ఇవ్వాలి'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter