5000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ అందమైన రంగోలిని తీర్చిదిద్దితే, చూడటానికి ఆ రంగోలి ఎంత అందంగా ఉంటుంది! ఆ ఊహే ఎంతో అద్భుతంగా ఉంది కదా!!
అయితే, ఇదిగో ఆ ఊహనే ఇక్కడ నిజం చేసి చూపించారు గుజరాత్‌లోని వదోదరకు చెందిన ఎక్దంత్ రంగోలి కళాకార్ అనే గ్రూప్‌కి చెందిన కళాకారులు.
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని 30 మంది కళాకారులు 5:50 గంటలపాటు శ్రమించి ఈ రంగోలిని పూర్తి చేసినట్టు రంగోలి గ్రూప్‌కి చెందిన శేఖర్ ఖేద్కర్ తెలిపారు.