బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ జింకను వేటాడిన కేసులో జోధ్‌పూర్ న్యాయస్థానం ఈరోజు తీర్పు ఇవ్వనుంది. సుమారు ఉదయం 11 గంటల సమయంలో ఈ తీర్పును ధర్మాసనం ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ సల్మాన్ దోషి అని తేలితే ఆయనను జైలులో పెట్టాల్సి ఉంటుంది. అందుకోసం ఓ కారాగారాన్ని కూడా సిద్ధం చేశారు జైలు అధికారులు.
అయితే అందరి ఖైదీల మాదిరిగానే ఆయన శిక్షను అనుభవించాల్సి ఉంటుంది అని.. సెలబ్రిటీ కాబట్టి ఆయనకుంటూ ఎలాంటి సౌకర్యాలు ఉండవని జోధ్‌పూర్ సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ విక్రమ్ సింగ్ తెలియజేశారు. ఈ తీర్పు వెలువడతున్న సందర్భంగా దాదాపు 200 మంది పోలీసులను ఆ న్యాయస్థానం పరిసర ప్రాంతాల్లో భారీస్థాయిలో మోహరించారు. 1998లో విడుదలైన ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ జింకను వేటాడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి
మొన్నటి వరకూ అబుదబిలోని రేస్ 3 సినిమా షూటింగ్లో ఉన్న సల్మాన్ ఈ కేసు కోసమే ప్రత్యేకంగా ఛార్టడ్ విమానంలో బుధవారం ముంబయికి వచ్చారు. ఈ కేసులో సల్మాన్‌తో పాటు నటుడు సైఫ్ అలీ ఖాన్, టబు, నీలమ్‌లపై కూడా కేసులు నమోదయ్యాయి. వారు కూడా ఈ రోజు జోధ్‌పూర్ రానున్నారు.
జోధ్‌పూర్ ప్రాంతానికి దగ్గరలో ఉన్న కంకని గ్రామంలో మేత మేయడానికి వచ్చిన రెండు అరుదైన జాతికి చెందిన జింకలను సల్మాన్ హతమార్చారని ఆయనపై అభియోగాలున్నాయి. అటవీ ప్రాణుల సంరక్షణ చట్టం సెక్షన్ 51 ప్రకారం అప్పట్లో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో శిక్ష పెడితే దాదాపు 6 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
Jodhpur: Police personnel deployed outside Jodhpur court ahead of verdict in Blackbuck poaching case. Saif Ali Khan,Neelam & Sonali Bendre's lawyer says,'if they are found guilty then there is equal punishment for all. Maximum punishment will be for six years & minimum one year.' pic.twitter.com/omRMnr3Weh
— ANI (@ANI) April 5, 2018
It's tough to hear what's happening in that video where Saif Ali Khan says "sheehsa upar karo aur reverse kar lo warna padegi ek" ..
So, using the latest bluetooth technology, I've made it clearer by isolating the audio in the car.. pic.twitter.com/BjXnDXcATw— José Covaco (@HoeZaay) April 4, 2018