దోమల ప్రభావిత ప్రాంతాలను గుర్తించే డ్రోన్ ను ఆవిష్కరించిన పాఠశాల విద్యార్థి

పశ్చిమ బెంగాల్, సిలిగురి మునిసిపల్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ) నగరంలోని దోమల ప్రభావిత ప్రాంతాలను తనిఖీ చేయడానికి డ్రోన్ల వాడకాన్ని ప్రవేశపెట్టింది.

Last Updated : Feb 26, 2018, 12:12 PM IST
దోమల ప్రభావిత ప్రాంతాలను గుర్తించే డ్రోన్ ను ఆవిష్కరించిన పాఠశాల విద్యార్థి

పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి మునిసిపల్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ) నగరంలో దోమల ప్రభావిత ప్రాంతాలను పరిశీలించడానికి డ్రోన్ల వాడకాన్ని ప్రవేశపెట్టింది. ఒక పాఠశాల విద్యార్థి ఆవిష్కరించిన డ్రోన్ సహాయంతో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.

'మేము ఒక నెలా రోజులపాటు ఈ డ్రోన్ ద్వారా నగరంలో దోమల ప్రభావిత ప్రాంతాలను గుర్తిస్తాము. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ గురించి అనేక రాష్ట్రాలు నన్ను అడిగాయి. డెంగ్యూను అరికట్టే చర్యల్లో ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నా. ఇది సక్సెస్ అయితే ఇతర రాష్ట్రాలతో ఈ విషయమై మాట్లాడుతాం" అని సిలిగురి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ అశోక్ భట్టాచార్జీ తెలిపారు.

ఈ డ్రోన్ ను ఆవిష్కరించిన విద్యార్థి రాజీవ్ ఘోష్ మాట్లాడుతూ- "గత ఏడాది, సిలిగురిలో డెంగ్యూ సమస్య ఉందని, ఎత్తైన భవనాల్లో డెంగ్యూ లార్వా ఉనికిని గుర్తించడం చాలా కష్టంగా ఉండేది" అని చెప్పారు. దోమల ప్రభావిత ప్రాంతాల ఏరియల్ ఫుటేజ్ లను సేకరించడానికి ఈ డ్రోన్ ఎంతగానో సహాయపడుతుందని అన్నారు.

2017 నాటి ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం, 1,287 మందికి డెంగ్యూ వ్యాధి సోకినట్లు, డెంగ్యూ వల్ల నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు నివేదించింది. డెంగ్యూ లక్షణాలతో సిలిగురి జిల్లా ఆసుపత్రి, నార్త్ బెంగాల్ వైద్య కళాశాల&ఆసుపత్రి (ఎన్బీఎంసీహెచ్)లో చాలామందిని అడ్మిట్ అయ్యారని నివేదిక వెల్లడించింది.

Trending News