4 cooling Herbs in Summer: వేసవి వేడి నుంచి ఈ 4 మూలికలు మీ పిల్లల్ని కాపాడతాయి.. శరీరాన్ని చల్లగా ఉంచుతాయి..

4 cooling Herbs in Summer: మండే ఎండలు శరీరం అంతా వేడిగా మారిపోతుంది. పిల్లలు, పెద్దలు అంతా స్కిన్‌ అలర్జీ, ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఎండ వల్ల శరీరం ట్యాన్ అయిపోతుంది. శరీరాన్ని లోపలి నుంచి చల్లదనాన్ని అందించే కొన్ని రకాల మూలికలు ఉన్నాయి.

Written by - Renuka Godugu | Last Updated : May 4, 2024, 10:27 AM IST
4 cooling Herbs in Summer: వేసవి వేడి నుంచి ఈ 4 మూలికలు మీ పిల్లల్ని కాపాడతాయి.. శరీరాన్ని చల్లగా ఉంచుతాయి..

4 cooling Herbs in Summer: మండే ఎండలు శరీరం అంతా వేడిగా మారిపోతుంది. పిల్లలు, పెద్దలు అంతా స్కిన్‌ అలర్జీ, ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఎండ వల్ల శరీరం ట్యాన్ అయిపోతుంది. శరీరాన్ని లోపలి నుంచి చల్లదనాన్ని అందించే కొన్ని రకాల మూలికలు ఉన్నాయి. అవి మీ పిల్లల శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. ఇది ఎండకాలం మనకు వరం లాంటిది.  వేసవి వేడిమి నుంచి మన శరీరాన్ని రక్షిస్తాయి. ర్యాషెస్ రాకుండా మీ శరీరాన్ని కాపాడతాయి. ముఖ్యంగా మన దేశంలో మంచి మూలికలు దొరుకుతాయి. వీటితో మీ పిల్లల శరీరం చల్లగా ఉంటుంది.

కలబంద..
కలబంద చల్లదనాన్ని అందిస్తుంది. ఇది ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఔషధాల్లో వినియోగిస్తారు. ఈ ఎండకాలం కలబందను తీసుకుంటే సూపర్‌గా పనిచేస్తుంది. అంతేకాదు చర్మం ట్యాన్‌ అవ్వకుండా కాపాడుతుంది. ఇందులో కూలింగ్‌ గుణాలు ఉంటాయి. అంతేకాదు మీ పిల్లవాడికి రోజంతటికీ కావాల్సిన హైడ్రేషన్‌ అందిస్తాయి. కలబందతో తయారు చేసిన జ్యూస్‌ పిల్లవాడి డైట్లో చేర్చాలి. పండ్ల జ్యూసులు, స్మూథీల్లో వేసి ఇవ్వండి. ఇలా మీ పిల్లల డైట్లో కలబందను చేరిస్తే వారి శరీరం ఎండలకు చల్లగా ఉంటాయి. 

వేప..
వేపను కూడా శతాబ్దాలుగా ఆయుర్వేదంలో వినియోగిస్తారు. వేపలో యాంటీ బ్యాక్టిరియల్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.  సాధారణంగా వీటి ఆకులను నీళ్లలో వేసి మరిగించుకుని స్నానం చేస్తారు. పిల్లలకు కూడా ఇలాగే వేపాకులను అరగంటపాటు స్నానం చేసే నీటిలో వేసి మరిగించి స్నానం చేయించండి. అంతేకాదు వేపాకును గ్రైండ్‌ చేసి చిన్న బాల్‌ మాదిరి తయారు చేసి పరగడుపున వాళ్లకు ఇవ్వండి. కడుపులో వారికి ఏమైనా పుండ్లు ఉన్నా త్వరగా బయటకు వెళ్లిపోతాయి. ఇమ్యూనిటీ వ్యవస్థను కూడా బలపరుస్తుంది.

ఇదీ చదవండి: ఈ 5 లాభాలు పొందాలంటే.. పాలకూరను తరచూ తినాల్సిందే..!

పుదీనా..
పుదీనా వంటగదుల్లో కచ్చితంగా ఉంటుంది. అయితే, పుదీనాలో కూడా కూలింగ్‌ గుణాలు ఉంటాయి. ముఖ్యంగా పుదీనాలో ఫైటోన్యూట్రియేంట్స్‌, విటమిన్ సీ రీఫ్రెషింగ్‌ ఫ్లేవర్ ఇస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. పుదీనా శరీర ఉష్ణోగ్రతను కూడా తగ్గిస్తుంది.  పుదీనాతో తయారు చేసిన జ్యూస్‌ పిల్లలకు ఇవ్వండి.

ఇదీ చదవండి: మీరు నమ్మలేరు.. ఈ 8 కూడా డయాబెటిస్ లక్షణాలేనట..

కొత్తిమీర..
కొత్తమీరలో కూడా చల్లదనాన్ని అందించే గుణాలు ఉంటాయి. ఇది శరీర ఉష్ణోగ్రతను నిర్వహిస్తాయి.  కొత్తిమీరను కూరలు వేసుకుని తీసుకుంటాం. అయితే, పుదీనా, కొత్తిమీర వేసి  జ్యూస్‌ లేదా చట్నీ తయారు చేసి పిల్లలకు పెట్టండి..(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News