Amla Benefits: ఉసిరిని ఇలా ఊరబెట్టి రోజూ ఉదయం తింటే చాలు.. డాక్టర్‌ వద్దకు వెళ్లాల్సిన అవసరమే లేదు..

​Amla Dipped In honey Benefits: మారుతున్న వాతావరణం కారణంగా మన డైట్‌ కూడా మార్చుకోవాలి. ఆరోగ్యకరమైన డైట్‌ ఫాలో అవ్వాలి. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. సీజనల్‌ జబ్బులు మీ దరిచేరకుండా కాపాడుతుంది. అయితే, తేనెలో నానబెట్టిన ఉసిరికాయను తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Feb 1, 2025, 09:58 AM IST
Amla Benefits: ఉసిరిని ఇలా ఊరబెట్టి రోజూ ఉదయం తింటే చాలు.. డాక్టర్‌ వద్దకు వెళ్లాల్సిన అవసరమే లేదు..

Amla Dipped In honey Benefits: సీజన్‌ మారినప్పుడు దానికి అనుకూలంగా తగిన పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. సీజనల్‌ జబ్బులు రాకుండా నివారిస్తాయి. కొన్ని రకాల పండ్లు సూపర్‌ ఫుడ్‌లా పనిచేస్తాయి.  తేనేలో ఉసిరి నానబెట్టి తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏముంటాయి తెలుసుకుందాం.

తేనెలో ఉసిరికాయ నానబెట్టి తీసుకోవడం వల్ల ఆరోగ్యం, ఇమ్యూనిటీకి వరం. ఉసిరిలో విటమిన్‌ సీ పుష్కలంగా ఉంటుంది.  ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. ఇవి సీజనల్‌ జబ్బులు రాకుండా నివారిస్తాయి. ఇది జుట్టుతోపాటు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.  జలుబు, గొంతునొప్పికి చక్కని రెమిడీ. అంతేకాదు ఈ కాంబినేషన్‌ జీర్ణ సమస్యలకు కూడా వరం. తేనెలో ఉసిరి నానబెట్టి తీసుకోవడం వల్ల మంచి డిటాక్సిఫికేషన్‌లా పనిచేస్తుంది. రంలో చక్కెర స్థాయిలను నియంత్రించి గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గిపోతాయి. తేనెలో ఉసిరి నానబెట్టి తీసుకోవడం వల్ల సహజంగా మన శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఇది ప్రతి రోజూ మన డైలీ రొటీన్‌లో యాడ్‌ చేసుకోవాలి.

తేనెతో ఆరోగ్య లాభాలు.
తేనె సూపర్‌ ఫుడ్‌ ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్‌, యాంటీ బ్యాక్టిరియల్‌ గుణాలు ఉంటాయి. తేనె సీజనల్‌ జబ్బులకు చెక్‌ పెడుతుంది. దగ్గు నివారిస్తుంది. తేనె మన శరీరానికి తక్షణ శక్తి కూడా అందిస్తుంది. జీర్ణ సమస్యలను నయం చేస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ముఖ్యంగా యాసిడిటీకి చెక్‌ పెడుతుంది. అంతేకాదు మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

ఉసిరి ప్రయోజనాలు..
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉసిరిలో విటమిన్‌ సీ ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతుంది. ఉసిరి తరచూ మనం తీసుకోవడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యం బాగుంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ తగ్గిస్తుంది. బ్లడ్‌ సర్క్యూలేషన్‌ను మెరుగుపరుస్తుంది. ఉసిరి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఇది డయాబెటిక్‌ రోగులకు వరం.

ఇదీ చదవండి:  ఇది జుట్టుకు రాస్తే పలుచగా ఉన్నచోట జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.. ఈరోజే ట్రై చేయండి..

ఉసిరి తేనెలో నానబెట్టి తీసుకోవడం వల్ల ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు మన చర్మం, జుట్టుకు మంచి హైడ్రేషన్‌ అందిస్తుంది. ఇది చర్మంపై ఉండే యాక్నేకు కూడా తగ్గిస్తుంది. ముఖం మెరిసిపోతుంది. జుట్టుపై చుండ్రు రాకుండా తగ్గిస్తుంది. బీపీని అదుపులో ఉంచుతుంది. గుండె ఆరోగ్యంగా ఉండేలా ప్రోత్సహిస్తుంది.

ఉసిరిలో డిటాక్సిఫైంగ్‌ గుణాలు ఉంటాయి. ఇందులో నేచురల్‌ గుణాలు ఉంటాయి. గుండెను ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుతుంది.  కడుపులో గ్యాస్‌ అజీర్తి రాకుండా నివారిస్తుంది. అంతేకాదు మలబద్ధకం సమస్య రాకుండా నివారిస్తుంది. ఉసిరిలో ఫైబర్‌, విటమిన్‌ సీ ఉంటుంది. ఉసిరిని నేరుగా ఉప్పు వేసి తినేవారు ఉన్నారు. ఇది కాకుండా పచ్చడి కూడా తయారు చేసుకుంటారు. ఎన్నో ఏళ్లుగా మన భారతీయ సంప్రదాయంలో ఉసిరి కీలకం. ఇది తింటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు ఉసిరితో హెయిర్‌ ప్యాక్‌లు కూడా తయారు చేసుకుంటారు.

ఇదీ చదవండి: ఫిబ్రవరి ప్రారంభం ముందే ఉక్కపోత షురూ.. రెండు రోజులుగా పెరిగిన ఉష్ణోగ్రతలు..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News