Heart Attack Risk: గుండె పోటు ముప్పును దూరం చేసే 4 హెల్తీ హ్యాబిట్స్ ఇవే

Heart Attack Risk: ప్రపంచవ్యాప్తంగా గుండె వ్యాధుల ముప్పు పెరుగుతోంది. దురదృష్టవశాత్తూ ఇండియాలో ఈ పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. కారమం చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి. యుక్త వయస్సులోనే గుండెపోటుకు గురవుతున్న పరిస్థితి. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 17, 2024, 05:08 PM IST
Heart Attack Risk: గుండె పోటు ముప్పును దూరం చేసే 4 హెల్తీ హ్యాబిట్స్ ఇవే

Heart Attack Risk: గుండె పోటు అనేది ప్రస్తుతం సాధారణమైపోయింది. వయస్సుతో సంబంధం లేకుండా అందరికీ ఎటాక్ చేస్తోంది. ఒకప్పుడు ఇది వృద్ధాప్యంలో ఉన్నవారికి లేదా మద్య వయస్సువారికి మాత్రమే వచ్చేది. కానీ ప్రస్తుతం లైఫ్‌స్టైల్ కావచ్చు లేదా ఆహారపు అలవాట్లు కావచ్చు వయస్సుతో సంబంధం లేకుండా అందర్నీ వెంటాడుతోంది. చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎందుకీ పరిస్థితి, ఎలా రక్షించుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.

చెడు ఆహారపు అలవాట్లు కారణంగా రక్త నాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంటుంది. దాంతో రక్తం గుండె వరకూ చేరడంలో ఇబ్బంది తలెత్తి ఒత్తిడి పెరగడంతో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందో గుండె వ్యాధుల ముప్పు ఎదురౌతుంది. హార్ట్ ఎటాక్ రావచ్చు. ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు కొన్ని అలవాట్లు మానుకోవాలి. కొన్ని పద్ధతులు పాటించాలి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి. ఆధునిక జీవనశైలి ఉద్యోగాల కారణంగా బహుశా మీరు 8-10 గంటలు కూర్చుని పని చేస్తుంటారు. దాంతో శారీరక శ్రమ లోపించడం వల్ల హార్ట్ ఎటాక్ ముప్పు పెరిగిపోతుంటుంది. అందుకే ఎంత బిజీగా ఉన్నా సరే రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం లేదా వాకింగ్ లేదా రన్నింగ్ అనేది చాలా చాలా అవసరం. దీనివల్ల గుండె వ్యాధుల ముప్పు తగ్గుతుంది.

గుండెను పదికాలాలు పదిలంగా ఉంచుకోవాలంటే హెల్తీ ఫుడ్ అనేది ముఖ్యం. అనారోగ్యకరమైన ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలి. ప్యాకెట్ ఫుడ్, ప్రోసెస్డ్ ఫుడ్, షుగర్, రెడ్ మీట్, ఫ్రైడ్ పదార్ధాలు మానేయాలి. తృణ ధాన్యాలు, తాజా పండ్లు కూరగాయలు, చేపలు తింటే మంచిది. ఇక అన్నింటికంటే ముఖ్యమైంది ఒత్తిడి, ఆందోళనకు దూరంగా ఉండటం. హార్ట్ ఎటాక్ ముప్పును పెంచడంలో ఈ రెండూ కీలకమైనవి. అందుకే ఒత్తిడికి దూరంగా ఉండేందుకు యోగా, వాకింగ్ వంటివి అవసరం.

చెడు అలవాట్లు పూర్తిగా మానేయాలి. ముఖ్యంగా స్మోకింగ్, మద్యపానం అనేవి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ అలవాట్లు ఎంత త్వరగా మానుకుంటే అంత మంచిది. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఈ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. 

Also read: Health Remedies: ఈ 5 వ్యాయామాలు ఆచరిస్తే కిడ్నీ, లివర్ ఎప్పటికీ చెడిపోవు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News