Green Tea: డయాబెటిస్, ఒబెసిటీకు అద్భుతమైన ఔషధం గ్రీన్ టీ, ఎవరు తీసుకోకూడదు

Green Tea: గ్రీన్ టీ కచ్చితంగా అద్భుతమైన ఔషధం. చక్కెర వ్యాధిగ్రస్థులకు మంచి మందు. ఒబెసిటీ తగ్గించుకునేందుకు అంటే లావు తగ్గాలంటే ఇదే మంచి ప్రత్యామ్నాయం. అదే సమయంలో కొందరు గ్రీన్ టీ తీసుకోకూడదు కూడా. అదేంటో చూద్దాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 24, 2022, 04:17 PM IST
Green Tea: డయాబెటిస్, ఒబెసిటీకు అద్భుతమైన ఔషధం గ్రీన్ టీ,  ఎవరు తీసుకోకూడదు

Green Tea: గ్రీన్ టీ కచ్చితంగా అద్భుతమైన ఔషధం. చక్కెర వ్యాధిగ్రస్థులకు మంచి మందు. ఒబెసిటీ తగ్గించుకునేందుకు అంటే లావు తగ్గాలంటే ఇదే మంచి ప్రత్యామ్నాయం. అదే సమయంలో కొందరు గ్రీన్ టీ తీసుకోకూడదు కూడా. అదేంటో చూద్దాం.

గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. సన్నబడటానికి ఎక్కువగా గ్రీన్ టీ వాడుతుంటారు. అయితే గ్రీన్ టీ కేవలం డైటింగ్ కోసమే కాదు..ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనకరమని తెలుసా మీకు. గ్రీన్ టీ  రోజూ సేవిస్తే..గుండె పదికాలాలపాటు పదిలంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు క్రమం తప్పకుండా తీసుకుంటే..రక్తపోటు అదుపులో ఉంటుంది. క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి. ఒబెసిటీతో బాధపడేవారు గ్రీన్ టీ ప్రతిరోజూ తీసుకుంటే బరువు తగ్గుతారు. 

డయాబెటిస్‌కు అద్భుత ఔషధం

టైప్ 2 డ‌యాబెటిస్ఉన్న‌వారు ప్రతిరోజూ గ్రీన్ టీని సేవిస్తే..మీ శరీరంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఎందుకంటే గ్రీన్ టీలో కొటేకిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్క‌లంగా ఉంటుంది. ఇది బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది. మనిషి శరీరం..కార్బొహైడ్రేట్లను త్వరగా జీర్ణం చేయకుండా..నియంత్రిస్తాయి.   ఫలితంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ త‌గ్గుతుంది. బ‌రువు ఎప్పుడైతే తగ్గుతుందో..ఇన్సులిన్ రెసిస్టెన్స్ త‌గ్గుతుంది. శ‌రీరంలో ఉన్న ఇన్సులిన్ స‌రిగ్గా వినియోగం అవుతుంది. దీంతో ర‌క్తంలో షుగ‌ర్ లెవెల్స్ త‌గ్గుతాయి. ఈ విధంగా టైప్ 2 డ‌యాబెటిస్ అదుపులో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు రోజూ 2-3 కప్పుల గ్రీన్ తాగితే మంచిది. 

డయాబెటిస్ సమస్య ఉన్నవారికి మాత్రం గ్రీన్ టీ ఓ దివ్యౌషధమే అనడంలో సందేహం లేదని వైద్యులు సూచిస్తున్నారు. మార్కెట్లో ప్రస్తుతం గ్రీన్ టీ వివిధ రకాల రుచుల్లో లభిస్తోంది. గ్రీన్ టీ లెమన్, గ్రీన్ టీ హనీ, గ్రీన్ టీ జింజర్, గ్రీన్ టీ తులసి ఇలా చాలా రకాలున్నాయి. మన అవసరానికి తగ్గట్టుగా ఎంచుకోవాలి. గ్రీన్ టీ మంచిది కదా అని అపరిమితంగా తీసుకోకూడదు. రోజుకు 2 కప్పులకు మించకపోవడం చాలా మంచిది.

గ్రీన్ టీ ఎవరు తీసుకోకూడదు

అలాగని అందరూ తీసుకోవడం కూడా మంచిది కాదు. వైద్యుల సూచన మేరకే గ్రీన్ టీ తీసుకోవాలి. ఎందుకంటే గ్యాస్, ఎసిడిటీ, కెఫీన్ అలర్జీ ఉన్నవారికి గ్రీన్ టీ అంత మంచిది కాదు. మితంగా తీసుకోవాలి. గ్రీన్ తాగినప్పుడు ఏదైనా సమస్యగా అన్పిస్తే మానేయడం మంచిది. 

Also read: Dengue: డెంగ్యూ నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమే..ప్లేట్‌లెట్ కౌంట్ ఎంత ఉండాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News