How To Reduce Cholesterol In 30 Days: శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ఉంటే ఆరోగ్యకరమైన కణాలు పుట్టుకొస్తూ ఉంటాయి. కానీ చెడు కొలెస్ట్రాల్ రక్తంలో పేరుకు పోతే.. అధిక రక్తపోటు, గుండెపోటు, మధుమేహంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా పలు రకాలు చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండాలి.
మీరు ప్రతిరోజు తీసుకునే ఆహారంలో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండడానికి నాలుగు రకాల ఆహారాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవడానికి ట్రాన్స్ ఫ్యాట్, స్వీట్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ కు దూరంగా ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ కింది ఆహారాలను తీసుకోకపోవడం వల్ల కూడా శరీరంలో కొలెస్ట్రాలను నియంత్రించుకోవచ్చు.
1. బిస్కెట్లు:
బిస్కెట్లు కొలెస్ట్రాల్ కు మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందా అని అనుకుంటున్నారా? అవును ఉంటుంది.. బిస్కెట్లలో అనారోగ్యకరమైన కొలెస్ట్రాల్ ఉండడమే కాకుండా.. ట్రాన్స్ ఫ్యాట్ కూడా అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి కుకీలను ప్రతిరోజు తినడం వల్ల శరీరంలో తీవ్రంగా కొలెస్ట్రాల్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు వీటిని తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్యాన్ని నిపుణులు చెబుతున్నారు.
Also Read: Hyderabad Bangles Market: గాజుల షాపింగ్‌కు ఇక్కడికి వెళ్లండి.. అదిరిపోయే డిజైన్లు ఉన్నాయి
2. ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆహారాలు:
ఆధునిక జీవన శైలి కారణంగా ప్రస్తుతం చాలామంది తాజా ఆహారాలకు బదులుగా ఫ్రిజ్లో ప్రాసెస్ చేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలో ఫ్యాట్ పరిమాణాలు విచ్చలవిడిగా పెరిగి.. గుండెపోటు సమస్యలతో పాటు మధుమేహం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఫ్రోజెన్ ఫుడ్ అతిగా తినకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
3. కేక్:
కేకుల్లో అధిక పరిమాణంలో ఫ్యాట్ ఉంటుంది. ప్రస్తుతం చాలా బేకరీలు ప్రజలను మోసం చేసేందుకు జీరో ట్రాన్స్ ఫ్యాట్ కేకులు అని కూడా అమ్ముతున్నారు. అని వీటిలో కూడా ఫ్యాట్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి కేకులను ప్రతిరోజు తినడం వల్ల శరీరంలో విచ్చలవిడిగా కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. అంతేకాకుండా మధుమేహం సమస్యలు వచ్చే అవకాశాలు అధికమని ఆరోగ్య నిపుణు లు సూచిస్తున్నారు. కాబట్టి ఇప్పటికే కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు కేకులను అతిగా తినకపోవడం చాలా మంచిది.
4. ఫ్రెంచ్ ఫ్రైస్:
ప్రస్తుతం చాలామంది టీ తాగే క్రమంలో స్నాక్స్ గా ఫ్రెంచ్ ఫ్రైలను అతిగా తీసుకుంటున్నారు. వీటిలో హైడ్రోజనేటెడ్ కొవ్వులు అతిగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు వీటిని తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Hyderabad Bangles Market: గాజుల షాపింగ్‌కు ఇక్కడికి వెళ్లండి.. అదిరిపోయే డిజైన్లు ఉన్నాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook