Diabetes Control: మామిడి పండుతోనే కాకుండా మామిడి ఆకులతో కూడా అనేక లాభాలున్నాయి. ఈ ఆకులలో ఆంథోసైనిడిన్స్ అని పిలువబడే టానిన్లు ఉంటాయి. ఇవి మధుమేహం చికిత్సకు సహాయపడతాయని ఆయుర్వేద శాస్త్రంలో వివరించారు. డయాబెటిక్ పేషెంట్లు రక్తంలో చక్కెరను నియంత్రించేందుకు మామిడిని ఆకులను తినవచ్చని నిపణులు సూచిస్తున్నారు. నిజానికి మామిడి ఆకులు ఇన్సులిన్ ఉత్పత్తి, గ్లూకోజ్ డెలివరీని మెరుగుపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరపరిచేందుకు సహాయపడతాయి.
మామిడి ఆకులను ఎలా ఉపయోగించాలి:
ఈ మామిడి ఆకులను ఎలా చికిత్స కోసం ఎలా వినియోగించాలని ఆలోచిస్తున్నారా..! ఇందుకోసం ముందుగా 10-15 మామిడి ఆకులను తీసుకోవాలి. ఆ తర్వాత నీటిలో వేసి మరిగించాలి. ఇప్పుడు ఈ ఆకులను రాత్రిపూట ఆ నీటిలో వదిలేసి. వాటిని మరుసటి రోజు ఉదయం వడపోసి ఖాళీ కడుపుతో త్రాగాలి. ఇలా క్రమం తప్పకుండా తాగడం వల్ల బ్లడ్‌లో షుగర్ కంట్రోల్ అవుతుందని నిపుణులు తెలుపుతున్నారు.
ప్రీ-డయాబెటిస్ రోగులు తప్పనిసరిగా తాగాలి:
నిజానికి మామిడి ఆకుల్లో రక్తంలోని చక్కెరను నియంత్రించే ముఖ్యమైన పోషకాలుంటాయి. ప్రీ-డయాబెటిస్ ఉన్నవారు లేదా ఈ వ్యాధితో బాధపడుతున్న వారు తప్పకుండా మామిడి ఆకులతో తయారు చేసిన రసాన్ని ఒకసారైనా తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read:High Cholesterol Treatment: చెడు కొలెస్ట్రాల్ నుంచి విముక్తి పొందడానికి రోజూ ఇలా చేయండి..!
Also read: Cucumber Drink Benefits: దోసకాయల డ్రింక్‌తో ఇలా సులభంగా బరువును తగ్గించుకోండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook