Gut Healthy Fruits: తాజా పండ్లు, కూరగాయలు డైట్లో చేర్చుకోవడం ఎంతో ముఖ్యం. మన శరీర ఆరోగ్యానికి మాత్రమే కాకుండా ఎలాంటి ఆరోగ్య సమస్యలు మన దరిచేరకుండా ఉంటాయి. కొన్ని రకాల ఆహారాలు కుంటుపడిన కడుపు ఆరోగ్య పరిస్థితిని కూడా రిపేర్ చేస్తాయి. అలాంటి ఆహారాలు తెలుసుకుందాం..
మనం తీసుకునే ఆహారం నేరుగా కడుపులోకి వెళుతుంది. ఒకవేళ తినేది అనారోగ్యకరమైన ఆహారం అయితే, ఇది ఇతర ఆరోగ్య సమస్యలు కూడా దారితీస్తుంది. మంచి కూరగాయలు, పండ్లు తీసుకోవడం వల్ల కడుపు ఆరోగ్య పనితీరు కూడా మెరుగవుతుంది.
అరటి పండ్లు..
అరటి పండ్లు డైట్లో చేర్చుకోవడం వల్ల ఇందులోని స్టార్చ్, ఫైబర్ పుష్కలంగా కలిగి ఉంటుంది. ఇది కడుపు పనితీరును మెరుగు చేసి, కడుపులో మంచి బ్యాక్టీరియా పెరిగేలా ప్రేరేపిస్తుంది.. దీంతో జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది. అరటి పళ్ళు తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటాయి. ఇది ప్రోబయోటిక్ కూడా కలిగి ఉంటుంది. మంచి బాక్టీరియా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్‌తో బాధపడేవారు అరటిపండు తీసుకోవాలి. ఇది ఆరోగ్యకరమైన పేగు కదలికకు కూడా తోడ్పడుతుంది.
ఆకుకూరలు..
ఆకుకూరలు తీసుకోవాలి ముఖ్యంగా పాలకూర, తోటకూర వంటివి తినడం వల్ల ఇందులోనే ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్ ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతుంది. ఆకుకూరలో మెగ్నీషియం కూడా ఉంటుంది.. ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మలబద్ధక సమస్యలు మన దరిచేరకుండా నివారిస్తుంది. ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల కడుపులో మంచి బ్యాక్టిరియా పెరిగేలా ప్రేరేపిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగు చేస్తాయి.
క్యారట్లు..
క్యారట్లు తీసుకోవడం వల్ల ఇందులోని ఫైబర్, బీటా కెరటీన్ యాంటీ ఆక్సిడెంట్ ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి. దీంతో సీజనల్ జబ్బులు కూడా మన దరిచేరకుండా ఉంటాయి. జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కడుపులో గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది. క్యారెట్ తీసుకోవడం వల్ల ఇందులోని ఫైబర్ అధిక బరువు పెరగకుండా నివారిస్తుంది. మలబద్ధక సమస్యను మన దరిచేరనివ్వదు.
ఇదీ చదవండి: ఈఎంఐ కట్టేవారికి అదిరిపోయే న్యూస్.. రెపోరేట్ తగ్గించిన ఆర్‌బీఐ..
యాపిల్..
యాపిల్‌లో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది పెక్టిన్ అంటారు. యాపిల్ తీసుకోవడం వల్ల కడుపులో మంచి బ్యాక్టిరియా పెరుగుతుంది.. ఇమ్యూనిటీ వ్యవస్థను కూడా బలపరుస్తుంది. ప్రతిరోజు ఒక యాపిల్ తినాలని వైద్యులు కూడా సూచిస్తూ ఉంటారు. యాపిల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడి, మలబద్దక సమస్య నుంచి నివారిస్తుంది. కడుపులో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. యాపిల్‌లోని జీర్ణ ఎంజైమ్‌లు ఆహారాన్ని విడగొట్టడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
అవకాడో..
అవకాడో ఈ బటర్ ఫ్రూట్లో కూడా ఫైబర్ ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని ఫ్రీ బయోటిక్ కడుపు ఆరోగ్యానికి మంచి పోషణ అందిస్తాయి. మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు కూడా కలిగి ఉండటం వల్ల మంట, వాపు సమస్యలు నివారిస్తుంది. అంతేకాదు కుంటుపడిన పేగు పనితీరును కూడా మెరుగు చేస్తుంది. ఇందులో కరిగే, కరగని ఫైబర్ ఉంటుంది. అవకాడోలోని మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు జీర్ణక్రియను మెరుగు చేస్తుంది.
ఇదీ చదవండి: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. వాట్సాప్‌లో ఇంటర్ హాల్‌టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి