చలికాలంలో సాధారణంగా ఇమ్యూనిటీ వేగంగా పడిపోతుంటుంది. అందుకే వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు సోకుతుంటాయి. వ్యాధుల బారిన పడుతుంటారు. ఈ సమయంలో ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్ధాలు తప్పకుండా తీసుకోవల్సి ఉంటుంది.
చలికాలంలో ఇమ్యూనిటీ తగ్గడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు తరచూ ఎదురౌతుంటాయి. ఈ పరిస్థితుల్లో తీసుకునే ఆహార పదార్ధాలు జాగ్రత్తగా ఎంచుకోవాలి. డైట్‌లో ఇమ్యూనిటీ పెంచే పదార్ధాలుండాలి. ఈ సమస్యకు అద్భుత పరిష్కారం అల్లం మాత్రమే. చాలామంది అల్లం టీ తాగడం ఇష్టపడుతుంటారు. కానీ అల్లంపాల గురించి ఎప్పుడైనా విన్నారా..అల్లం పాలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఎందుకంటే ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ వంటి గుణాలు పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో అల్లం పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి..
చలికాలంలో అల్లం పాలతో కలిగే ప్రయోజనాలు
గొంతు గరగర
గొంతుకు సంబంధించిన సమస్యలకు అల్లం పాలు అద్భుతంగా పనిచేస్తుంది. చలికాలంలో చాలామంది దగ్గు, గొంతులో కఫం, ఇన్‌ఫెక్షన్ సమస్యలతో బాధపడుతుంటారు. ఫలితంగా గొంతులో, ఛాతీలో కఫం పేరుకుపోతుంటుంది. ఈ సమస్యకు అల్లం పాలు అద్భుతమైన పరిష్కారం కాగలదు. నిర్ణీత పద్ధతిలో అల్లం పాలు తాగడం వల్ల చలికాలంలో ఎదురయ్యే దగ్గు, గొంతు సంబంధిత సమస్యలు దూరమౌతాయి. కానీ అల్లం పాలు తాగిన గంట తరువాత నీళ్లు తాగాలి.
మలబద్ధకం
కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతుంటే..అల్లం తీసుకోవడం వల్ల ప్రయోజనముంటుంది. అల్లం పాలు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చలికాలంలో రోజూ అల్లం పాలు తాగితే..మలబద్ధకం, అజీర్తి, యాసిడ్ వంటి సమస్యలు దూరమౌతాయి. మీక్కూడా మలబద్ధకం సమస్య ఉంటే..అల్లం పాలు తాగితే మంచి ఫలితాలుంటాయి.
Also read: Diabetes Silent Symptoms: మధుమేహంలో ఈ సైలెంట్ లక్షణాలు కన్పిస్తే...నిర్లక్ష్యం ప్రమాదకరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook