Cow Urine Unfit for Humans: ఆవు మూత్రం కంటే గేదె మూత్రంతోనే ఎక్కువ ఉపయోగాలు.. పరిశోధనలో సంచలన విషయాలు

IVRI Research On Cow Urine: ఆవు మూత్రంపై ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చేసింది. ఈ పరిశోధనలో ఆవు మూత్రం కంటే గేదే మూత్రంలోనే ఎక్కువ యాంటీ బ్యాక్టీరియా కారకాలు ఉన్నట్లు గుర్తించారు. మనుషులు సేవిస్తే.. ఎలాంటి ఇబ్బందులు వస్తాయో కూడా వెల్లడించారు. పూర్తి వివరాలు ఇలా.. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 14, 2023, 10:14 AM IST
Cow Urine Unfit for Humans: ఆవు మూత్రం కంటే గేదె మూత్రంతోనే ఎక్కువ ఉపయోగాలు.. పరిశోధనలో సంచలన విషయాలు

IVRI Research On Cow Urine: మన దేశంలో ఆవును గోమాతగా పూజిస్తారు. గోమూత్రంను అతి పవిత్రంగా భావిస్తూ.. మన శరీరంలో వివిధ వ్యాధులకు దారితీసే మలినాలను నాశనం చేసేందుకు సేవిస్తారు. గోమూత్రాన్ని అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఇప్పటికే చాలా పరిశోధనలు కూడా వెల్లడైంది. పురాతన కాలంలోని ఆయుర్వేదంలో.. వివిధ ఔషధాల తయారీలోనూ గోమూత్రంను ఉపయోగించారు. ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. పల్లెటూళ్లలో ఇంటి ముందు గోమూత్రం చల్లుకుంటారు. లక్షలాది మంది ఎంతో నమ్మకంతో సేవిస్తున్న గోమూత్రంలో హాని కలిగించే బ్యాక్టీరియా ఉందంటూ ఓ సంచలన పరిశోధన వెలుగులోకి వచ్చింది. 

బరేలీకి చెందిన ఐసీఏఆర్‌-ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐవీఆర్‌ఐ) పరిశోధన ప్రకారం.. ఆవు మూత్రంలో మానవులకు హాని కలిగించే అనేక హానికరమైన బ్యాక్టీరియా ఉంటుందని వెల్లడైంది. ముగ్గురు పీహెచ్‌డీ విద్యార్థులు ఆవు మూత్రంపై పరిశోధన చేసి నివేదికను వెల్లడించారు. ఆరోగ్యకరమైన ఆవుల మూత్రం నమూనాలలో 14 రకాల హానికరమైన బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. కడుపు ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే ఈ-కోలి వంటి బ్యాక్టీరియా ఉందని తెలిపారు. ఈ నివేదికను సమీక్షించిన పరిశోధన వెబ్‌సైట్ రీసెర్చ్ గేట్‌లో పబ్లిష్‌ చేసింది.

టైమ్స్‌ ఆఫ్ ఇండియాతో ఐవీఆర్‌ఐ ఇన్‌స్టిట్యూట్ ఎపిడెమియాలజీ విభాగం అధిపతి భోజరాజ్ సింగ్ మాట్లాడుతూ.. తాము ఆవు, గేదె, మానవుల మొత్తం 73 రకాల మూత్ర నమూనాలను పరిశీలించామని తెలిపారు. ఈ పరిశోధనలో ఆవు మూత్రం కంటే గేదె మూత్రంలో ఎక్కువ యాంటీ బాక్టీరియా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఎస్ ఎపిడెర్మిడిస్, ఇ రెపోంటిచి (S Epidermidis and E Repontichi) అనే బాక్టీరియాపై గేదే మూత్రం పవర్‌ఫుల్‌గా పనిచేస్తుందని వెల్లడించారు.

Also Read: CM Jagan Mohan Reddy: ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. వారి అకౌంట్లలో రేపే డబ్బులు జమ

'మేం పరిశోధనకు స్థానిక డెయిరీ ఫామ్ నుంచి సాహివాల్, థార్పార్కర్, విందావని (క్రాస్ బ్రీడ్) ఈ మూడు రకాల ఆవుల మూత్ర నమూనాలను తీసుకున్నాం. దీంతో పాటు గేదెలు, మనుషుల మూత్ర నమూనాలను కూడా సేకరించాం. ఈ పరిశోధన గతేడాది జూన్‌లో పూర్తి చేశాం. ఆరోగ్యకరమైన ఆవులు, గేదెలు, జంతువుల పరిమిత మూత్ర నమూనాలు పెద్ద మొత్తంలో వ్యాధికారక బ్యాక్టీరియాను కలిగి ఉన్నాయని మా పరిశోధనలో వెల్లడైంది..' అని భోజరాజ్ సింగ్ తెలిపారు. 

కొన్ని జంతువుల మూత్రం వివిధ రకాల బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా నిరోధక లక్షణాలను కలిగి ఉన్నాయని వెల్లడించారు. అయతే ఎట్టిపరిస్థితుల్లోనూ మనుషులు మూత్రం తాగవద్దని హెచ్చరించారు. స్వేదన మూత్రంలో ఇన్ఫెక్షన్ బాక్టీరియా ఉండదని కొందరు వాదించారని.. ఇందుకు సంబంధించి కూడా పరిశోధించామన్నారు. 

ఐవీఆర్ఐ మాజీ డైరెక్టర్ ఆర్‌ఎస్ చౌహాన్ మాట్లాడుతూ.. గత 25 ఏళ్లుగా గోమూత్రంపై తాను పరిశోధన చేస్తున్నానని.. స్వేదనం చేసిన ఆవు మూత్రం తీసుకుంటే మానవుల రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుందన్నారు. ఇది క్యాన్సర్, కోవిడ్‌లో కూడా ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. ప్రజలు గోమూత్రాన్ని తీసుకోవాలనుకుంటే.. శుద్ధి చేసిన గోమూత్రాన్ని వినియోగించాలని సూచించారు.

Also Read: Salman Khan New Car: సల్మాన్ ఖాన్‌కు హత్య బెదిరింపులు.. పవర్‌ఫుల్ బుల్లెట్ ప్రూఫ్ కారు కొనుగోలు.. ధర తెలిస్తే దిమ్మతిరుగుద్ది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News