/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Onion Juice: ఉల్లిపాయలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు ఉంటాయి. ఇది శరీరానికి పోషకాలు అందించడమేకాకుండా.. జుట్టు రాలిపోకుండా రక్షణ కలిగిస్తుంది. ఉల్లిపాయలో ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, సోడియం వంటి పోషకాలు ఉంటాయి. అందుకే ఉల్లిపాయలను ఆహారం, సలాడ్స్‌లో వినియోగిస్తారు. అయితే క్రమం తప్పకుండా ఉల్లిపాయ రసాలను వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు తెలుపుతున్నారు.  ఖాళీ కడుపుతో ఈ రసాన్ని తీసుకోవడం వల్ల బాడీకి మంచి ప్రొటీన్లు లభిస్తాయి. ఉల్లిపాయ రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఖాళీ కడుపుతో ఉల్లిపాయ రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:

రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
ప్రస్తుతం చాలా మంది కోవిడ్‌  కారణంగా.. రోగనిరోధక కోల్పోతున్నారు. దీంతో వారు తరచుగా అనారోగ్యానికి గురవుతారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారికి ఉల్లిపాయ రసం మంచి ఔషధంగా పని చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు,  విటమిన్ సి అధిక పరిమాణంలో ఉంటాయి. కావున శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. రోగ నిరోధక సమస్యలతో బాధపడుతుంటే ప్రతిరోజూ ఖాళీ కడుపుతో ఉల్లిపాయ రసాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

బరువు నియంత్రిస్తుంది:
ఉల్లిపాయ రసంలో కొలెస్ట్రాల్‌ పరిమాణం చాలా పరిమితంగా ఉంటుంది. అంతేకాకుండా  కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కావున జీర్ణక్రియపై ప్రభావవంతంగా పని చేస్తుంది. ముఖ్యంగా  జీర్ణక్రియ మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అయితే క్రమం తప్పకుండా తాగడం వల్ల బరువును కూడా సులభంగా నియంత్రిస్తుంది.

రక్తపోటును నియంత్రిస్తుంది:
ఉల్లిపాయ రసంలో క్వెర్సెటిన్ అనే ఫ్లేవనాయిడ్ అధిక పరిమాణంలో ఉంటాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా రక్తపోటును కూడా సులభంగా నియంత్రించడానికి సహాయపడుతుంది.

పొట్టకు మేలు చేస్తుంది:
ఉల్లిపాయ రసంలో ఇన్యులిన్ సమ్మేళనాలు పెద్ద పరిమాణంలో ఉంటాయి, కావున పొట్టలో సమస్యలను దూరం చేస్తాయి. ఈ రసాన్ని ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకుంటే.. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. కావున ఎవరైన జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా ఈ చిట్కాను ట్రై చేయండి.

 

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Naga Chaitanya: ప్రేయసితో పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికేసిన నాగచైతన్య !

Also Read: Happy Independence Day: రేపే భారత 76వ స్వాతంత్య్ర దినోత్సవం.. ఇండిపెండెన్స్ డే కొటేషన్స్, విషెస్, స్టేటస్‌లు మీకోసం 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Section: 
English Title: 
Onion Juice: Drinking Onion Juice On An Empty Stomach Boosts Immunity Controls Blood Pressure And Even Reduces Weight
News Source: 
Home Title: 

Onion Juice: ఉల్లి రసం జుట్టుకే కాదు.. శరీరానకి కూడా చాలా మంచిది..

Onion Juice: ఉల్లి రసం జుట్టుకే కాదు.. శరీరానకి కూడా చాలా మంచిది..
Caption: 
Onion Juice: Drinking Onion Juice On An Empty Stomach Boosts Immunity Controls Blood Pressure And Even Reduces Weight(Source: ZEETELUGUNEWS)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

ఖాళీ కడుపుతో ఉల్లిపాయ రసం తాగడం వల్ల

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

రక్తపోటును నియంత్రిస్తుంది

Mobile Title: 
Onion Juice: ఉల్లి రసం జుట్టుకే కాదు.. శరీరానకి కూడా చాలా మంచిది..
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Monday, August 15, 2022 - 17:22
Request Count: 
73
Is Breaking News: 
No