Rid Diabetes and Heart Disease: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే దీంతో పాటు మధుమేహం, గుండెపోటు వంటి తీవ్ర వ్యాధుల బారిన పడడం విశేషం.. అయితే ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు పలు రకాల ఆహార నియమాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇదే క్రమంలో తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ కూడా వహించాల్సి ఉంటుంది. బరువు తగ్గే క్రమంలో, మధుమేహాన్ని నియంత్రించుకోవడానికి తప్పకుండా తీసుకునే ఆహారంగా పోషకాలున్న ఆహారాలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్య నిపుణులు సూచించిన పలు రకాల ఔషధ మూలికలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం జలపాతాల్లో పెరిగే ఆయుర్వేద మూలలు కలిగిన స్పైరులినా(Spirulina) తీసుకోవాలి. అయితే వీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
స్పిరులినాలో లభించే పోషకాలు:
స్పిరులినాలో విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. ఈ మొక్క భాగాలలో 60 శాతం ప్రోటీన్లు ఉంటాయి. అంతేకాకుండా ఇందులో అమైనో ఆమ్లాలు కూడా అధిక పరిమాణంలో ఉంటాయి. ఈ స్పిరులినాను క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి విటమిన్ ఎ, ఐరన్, కాల్షియం, కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి.
స్పిరులినా తినడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు:
1.మధుమేహాన్ని నియంత్రిస్తుందా..?:
మధుమేహం వ్యాధులతో బాధపడుతున్నవారు తప్పకుండా తీసుకునే ఆహారంపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. స్పిరులినా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి కూడా తగ్గుతాయని నిపుణులు తెలుపుతున్నారు. దీంతో మధుమేహం సమస్యలు కూడా తగ్గుతాయి. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్నవారు క్రమం తప్పకుండా దీనిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
2. గుండె పోటును నివారిస్తుంది:
స్పిరులినా తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్ పెరుగుదలకు సహాయపడుతుంది. అంతేకాకుండా బీపీని కూడా అదుపులో ఉంచుతుంది. దీని కారణంగా గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, ట్రిపుల్ నాళాల వ్యాధి వంటి సమస్యలు దూరమవుతాయి.
3. బరువును నియంత్రిస్తుంది:
ప్రస్తుతం చాలా మంది బరువు పెరుగుతున్నారు. అయితే పెరుగుతున్న బరువును తగ్గించుకోవడానికి తప్పని సరిగా స్పిరులినాను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో బీటా కెరోటిన్, కొవ్వు ఆమ్లాలు, క్లోరోఫిల్, అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. కాబట్టి శరీరానికి అనేక రకాలుగా మేలు చేసి పొట్ట చుట్టు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read:Weight Loss: బరువు తగ్గే క్రమంలో ఈ నియమాలు పాటించండి.. కేవలం 11 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok