Weight Loss Tips: అధిక బరువుతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది అధిక బరువు సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, సమయానికి తినకపోవడం వంటివి అధిక బరువు సమస్యకు దారితీస్తున్నాయి. మరి అధిక బరువు సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి. ఇందుకోసం చాలామంది ప్రత్యేక డైట్‌ను ఫాలో అవుతుంటారు. కొందరికి అవి మంచి ఫలితాలనిస్తే.. కొందరికి సరైన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. అధిక బరువు సమస్యకు చెక్ పెట్టేందుకు కొంతమంది తమ డైట్లో పన్నీర్, ఎగ్ కాంబోని చేరుస్తారు. అయితే ఇది శరీర బరువును తగ్గించడంలో ఎంతవరకు దోహదపడుతుంది.. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు తెలుసుకుందాం..
పన్నీర్ తీసుకుంటే బరువు తగ్గుతారా..?
పన్నీర్లో ప్రోటీన్‌తో పాటు కొవ్వు కూడా ఉంటుంది. పన్నీర్ తీసుకుంటే శరీరానికి ఎక్కువ శక్తి లభిస్తుంది. చాలాసేపు ఆకలి వేయదు. 100 గ్రాముల పన్నీర్లో 72 కేలరీలు ఉంటాయి. కాబట్టి అధిక మొత్తంలో కాకుండా కొద్దిమొత్తంలో పన్నీర్ తీసుకుంటే బరువు తగ్గాలనుకునేవారికి ఉపయోగకరంగా ఉంటుంది.
గుడ్డు బరువును ఎలా తగ్గిస్తుంది?
గుడ్డులో పోషకాలు సమృద్దిగా ఉంటాయి. గుడ్డులోని పోషకాలు శరీరంలోని అమైనో ఆమ్లాల సమతుల్యతను కాపాడుతాయి. అంతేకాదు, జీవక్రియలను మెరుగుపర్చడం ద్వారా బరువు తగ్గించడంలో దోహదపడుతాయి. నడుము, పొత్తి కడుపు భాగాల్లో కొవ్వు తగ్గేలా చేస్తాయి.
పన్నీర్-ఎగ్ కాంబో :
బరువు తగ్గడానికి, కండరాలు బలంగా తయారవడానికి ప్రోటీన్ రిచ్ ఎగ్స్, చీజ్ చాలా అవసరం. గ్రేటర్ నోయిడాలోని గిమ్స్ డైటీషియన్ డాక్టర్ ఆయుషి యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. బరువు తగ్గడానికి ఈ కాంబో సరైనదే. ప్రొటీన్లు నెమ్మదిగా జీర్ణం కావడం వల్ల పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉండి ఆకలి అనిపించదు. కాబట్టి ఎక్కువ తినాల్సిన అవసరం ఉండదు. అయితే పన్నీర్-ఎగ్ కాంబోని కూడా మితంగా మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు.
(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారాన్ని స్వీకరించే ముందుచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: KCR Delhi Tour:వారం తర్వాత హైదరాబాద్ కు కేసీఆర్.. ఢిల్లీకి ఎందుకు వెళ్లినట్లు.. ఏం చేసినట్లు?
Also Read: Anagaraka Yoga: అంగారక యోగంతో ఈ 5 రాశుల వారికి పొంచి ఉన్న ముప్పు.. ఆగస్టు 10 వరకు జాగ్రత్తగా ఉండాలి