Weight Loss Diet: ప్రస్తుతం చాలా మంది బరువు తగ్గడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా జిమ్‌కి వెళ్లి కఠినతర వ్యాయామాలు కూడా చేస్తున్నారు. అయితే అయితే ఇక నుంచి అలా చేయకుండా కూడా సులభంగా శరీర బరువును నియంత్రించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బరువు తగ్గే క్రమంలో ఎలాంటి వ్యాయామాలు చేయకుండా సులభమైన డైట్‌లను పాటించి బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో శరీర బరువును నియంత్రించడానికి కార్బోహైడ్రేట్స్ తక్కువ పరిమాణంలో లభించే దాల్చిన చెక్క పాలను తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (MUFAs) ఉంటాయి. కాబట్టి ఈ పాలను రోజు తాగడం వల్ల సులభంగా శరీర బరువును నియంత్రించుకోవచ్చు.
దాల్చిన చెక్క పాలు కావాల్సిన పదార్థాలు:
1 కప్పు పాలు, 1 పావు దాల్చిన చెక్క బెరడు, తేనె
దాల్చిన చెక్క పాలు ఎలా తయారు చేయాలో తెలుసా?:
ముందుగా ఈ పాలను తయారు చేయడానికి 1 కప్పు పాలను బౌల్‌లో వేసి అందులో 1 ముక్క దాల్చిన చెక్క బెరడు వేసి బాగా మరిగించాల్సి ఉంటుంది. అందులో ఒక టీ స్పూన్ తేనె వేసి బాగా మరిగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక కప్పులు తీసుకుని సర్వ్ చేసుకుంటే శరీరాని చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
అరటి స్ప్లిట్, చియా సీడ్:
దీనికి కావాల్సి పదార్థాలు: 1 కప్పు తియ్యని బాదం పాలు, 1/2 కప్పు సాధారణ గ్రీకు పెరుగు, 1 1/2 టేబుల్ స్పూన్ మాపుల్ సిరప్, 1/2 టీస్పూన్ వెనిలా సారం, 1/4 కప్పు చియా గింజలు, 1 అరటిపండు (సన్నగా ముక్కలు చేసిన హువా), 1/2 కప్పు (ముక్కలుగా చేసి) స్ట్రాబెర్రీలు, 1/2 కప్పు బ్లూబెర్రీస్, మరియు 1/4 కప్పు తియ్యని కొబ్బరి రేకులు (కాల్చినవి).
అరటి స్ప్లిట్ చియా సీడ్ తయారి పద్దతి:
బాదం పాలు, పెరుగు, మాపుల్ సిరప్, వనిల్లాలను ఒక బౌల్‌లో మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే చియా గింజలను వేసి, రాత్రిపూట మూతపెట్టి ఫ్రిజ్‌లో ఉంచండి. ఆ తర్వాత మిగిలిన పదార్థాలను వేసి బాగా మిక్స్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ రెండు ఆహార పదార్థాలను ప్రతి రోజూ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే:
దాల్చిన చెక్క పాలును ప్రతి రోజూ తాగడం వల్ల సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా సులభంగా అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ పాలను తాగాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Rahul Sipligunj : బికినీ భామలతో రాహుల్ సిప్లిగంజ్ రొమాన్స్.. బడ్జెట్ బద్దల్ బాషింగాలైంతాందట!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook