న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తుంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆందోళన కలిగిస్తోందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, కరోనా కట్టడి విధుల్లో హాజరైన 29 మంది పోలీసులకు కరోనా పాజటీవ్ నిర్ధారణ కాగా పోలీస్‌శాఖ అప్రమత్తమైంది. కరోనా సోకిన పోలీసులు ఎవరెవరిని కలిసారో, వారితో పనిచేసిన ఇతర సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు తాజా కేసులతో ఢిల్లీలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 2,277కు చేరగా..కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 48కి చేరింది. ఇప్పటివరకు 724 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు.
Also read : బ్రేకింగ్: ఏపీలో తాజాగా 80 కరోనా కేసులు, ముగ్గురి మృతి
కరోనా ముంబయి మహానగరాన్ని వణికిస్తోంది. ఇప్పటికి భారత్ దేశంలో కరోనా వైరస్ 21,552 మందికి సోకగా 685 మంది మృత్యువాతపడ్డారు. ముంబయి నగరంలోనే 3683 కరోనా బారిన పడగా, మహారాష్ట్రలో 5649 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా వైరస్ బాధితులు సంఖ్య 943కు చేరుకోగా 24 మంది చనిపోయారు. ఆంధ్రప్రదేశ్ కరోనా రోగులు సంఖ్య 893కు చేరుకోగా 27 మంది మరణించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Also read : SBI నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ మరిచిపోయారా.. ఇలా చేయండి