7th Pay Commission DA Hike Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులందరికీ త్వరలో డీఏ, డీఆర్ పెంపును మోదీ ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెలాఖరులోగా లేదా నవరాత్రులలోపు డీఏ పెంపును ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది మొదటి డీఏ 4 శాతం ఉండగా.. ఈసారి 3 శాతం పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 42 శాతం అందుతుండగా.. 3 శాతం పెంచితే 45 శాతానికి చేరుకుంటుంది. ఈ మేరకు ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి. డీఏ పెంపు ప్రకటన తరువాత జూలై 1వ తేదీ నుంచి అమలు చేయనున్నారు.
డీఏ పెంపు ఇలా..
==> ఒక ఉద్యోగి శాలరీ నెలకు రూ.50 వేలు అయితే.. బేసిక్ జీతం రూ.15 వేలు అనుకుంటే..
==> 42 శాతం డీఏతో రూ.6,300 పొందుతారు.
==> 3 శాతం పెంపితే.. ఉద్యోగి నెలకు రూ.6,750 పొందుతారు. ఇది నెలకు రూ.450 వరకు పెరగనుంది. దీని ప్రకారం.. పెన్షనర్లు కూడా ప్రయోజనం పొందుతారు.
జూలై నెలలో విడుదల చేసిన డేటా ప్రకారం.. ఆల్ ఇండియా సీపీఐ 3.3 పాయింట్లు పెరిగి 139.7 పాయింట్లకు చేరుకుంది. డీఏ పెంపుపై ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ శివ గోపాల్ మిశ్రా మాట్లాడుతూ.. కరువు భత్యాన్ని 4 శాతం పెంచాలని ఫెడరేషన్ డిమాండ్ చేస్తోందన్నారు. కానీ ఈసారి ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్‌ను 3 శాతం పెంచే అవకాశం ఉందని చెప్పారు. లేబర్ బ్యూరో ప్రతి నెలా విడుదల చేసే పారిశ్రామిక కార్మికుల కోసం వినియోగదారుల ధరల సూచిక (CPI-IW) ఆధారంగా డీఏను పెంచుతున్న విషయం తెలిసిందే. ప్రతి నెల చివరి పనిదినం రోజున కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఈ డేటాను విడుదల చేస్తుంది. 2006లో కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, డీఆర్‌లను లెక్కించే ఫార్ములాను కేంద్ర ప్రభుత్వం మార్చింది.
Also Read: World Cup 2023: ప్రపంచకప్‌కు ముందు వన్డేల్లో నెం.1గా నిలిచేదెవరు..? లెక్కలు ఇలా..!
Also Read: New Parliament: కొత్త పార్లమెంట్ భవనానికి పేరు ఇదే, భారత్ పేరు మార్పిడి అంతా పుకారేన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook