Air India Delhi Mascow Service: ఢిల్లీ-మాస్కో మధ్య నడిచే ఎయిర్ ఇండియా విమాన సర్వీస్ గురువారం (ఏప్రిల్ 7) రద్దయింది. దీనికి కారణమేంటో తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు. ఇన్సూరెన్స్ కారణంగా ఎయిర్ ఇండియా తమ సర్వీస్‌ను రద్దు చేసుకుంది. రష్యా గగనతలంలో తమ విమానానికి ఇన్సూరెన్స్ వర్తిస్తుందో వర్తించదో అన్న భయంతో విమాన సర్వీసును రద్దు చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
సాధారణంగా విమాన ఇన్సూరెన్స్ ఇచ్చే కంపెనీలు పాశ్చాత్య దేశాలకు చెందినవి కావడం... ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా ప్రస్తుతం పాశ్చాత్య దేశాలన్నీ రష్యా నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించిన నేపథ్యంలో ఎయిర్ ఇండియాకు 'ఇన్సూరెన్స్' విషయంలో భయం పట్టుకుంది. దీంతో గురువారం నాటి సర్వీస్‌ను రద్దు చేసుకుంది. గత ఆదివారం (ఏప్రిల్ 3) నాటి సర్వీస్‌ను కూడా ఎయిర్ ఇండియా రద్దు చేసుకున్నట్లు చెబుతున్నారు.
వారంలో ఢిల్లీ-మాస్కో మధ్య ఎయిర్ ఇండియా రెండు సర్వీసులు నడుపుతోంది. ప్రతీ ఆదివారం, గురువారం ఈ సర్వీసులు ఉంటాయి. తాజాగా ఇన్సూరెన్స్ భయంతో ఈ వారంలో రెండు ట్రిప్స్‌ను ఎయిర్ ఇండియా రద్దు చేసుకున్నట్లయింది. ఇదే విషయంపై ఎయిర్ ఇండియాను పీటీఐ సంప్రదించే ప్రయత్నం చేయగా కంపెనీ ప్రతినిధుల నుంచి ఎటువంటి స్పందన రాలేదు.
Also Read: What is TATA NEU: టాటా న్యూ యాప్‌తో ఎవరికి, ఎలాంటి ఉపయోగాలు.. పూర్తి వివరాలు
Also read: Zuck Bucks: మెటా నుంచి డిజిటల్ కరెన్సీ.. 'జుక్ బక్స్' పేరుతో..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook