లాక్ డౌన్ వేళ.. పోలీసుల నృత్యాల హేల..

'కరోనా వైరస్' విస్తరిస్తున్న క్రమంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులు రోడ్లమీదే పహారా కాస్తున్నారు. ఐతే బయటకు రాకుండా ఉండడంతో జనానికి ఏం తోచడం లేదు. 

Last Updated : Apr 14, 2020, 04:31 PM IST
లాక్ డౌన్ వేళ.. పోలీసుల నృత్యాల హేల..

'కరోనా వైరస్' విస్తరిస్తున్న క్రమంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులు రోడ్లమీదే పహారా కాస్తున్నారు. ఐతే బయటకు రాకుండా ఉండడంతో జనానికి ఏం తోచడం లేదు. 

దీంతో బయట పహారా కాస్తున్న పోలీసులే వారికి వినోదం కల్పిస్తున్నారు. కరోనా వైరస్ జ్ఞానంతో కూడిన వినోదాన్ని అందిస్తున్నారు. అలాంటి ఘటనే అస్సాంలో జరిగింది. అస్సాంలో రంగోలి బిహు అనేది పెద్ద పండుగ.  కానీ కరోనా వైరస్ కారణంగా అస్సామీలు ఈ పండుగను సంతోషంతో జరుపుకోలేకపోయారు. లాక్ డౌన్ కారణంగా జనం ఇళ్ల నుంచి బయటకు  రాలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులే వారికి వినోదం కలిగించారు.

అస్సాం  రాజధాని గౌహతిలో పండగపూట పోలీసులు.. కాలనీలకు వెళ్లారు. రోడ్లపైనే నృత్యాలు చేస్తూ అందరికీ పండగ శుభాకాంక్షలు చెప్పారు. అంతే కాదు పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ఇళ్లల్లోనే ఉండండి.. ఆరోగ్యంగా ఉండండి.. అంటూ సందేశమిచ్చారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News