Covaxin vaccine: కోవ్యాగ్జిన్ వ్యాక్సిన్‌పై భారత్ బయోటెక్ కీలక ప్రకటన జారీ చేసింది. వ్యాక్సిన్ కారణంగా దుష్ఫరిణామాల గురించి స్పందించింది. ప్రతికూలతలు ఎదురైతే వైద్య సహాయం అందిస్తామని ప్రకటించింది.
ఇండియాలో ప్రారంభమైన వ్యాక్సినేేషన్ ( Vaccination ) ప్రక్రియపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా స్వదేశీ వ్యాక్సిన్‌గా ప్రాముఖ్యత పొందిన భారత్ బయోటెక్‌కు చెందిన కోవ్యాగ్జిన్ ( Covaxin ) విషయంలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో భారత్ బయోటెక్ కంపెనీ స్పందించింది. కోవ్యాగ్జిన్ తీసుకున్నవారు దుష్పరిణామాల బారిన పడితే నష్టపరిహారం చెల్లిస్తామని భారత్ బయోటెక్ ( Bharat Biotech ) వెల్లడించింది. తమ వ్యాక్సిన్ కారణంగా ప్రతికూలతలు ఎదురైతే వైద్య సహాయం అందిస్తామని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత అత్యంత తీవ్రమైన పరిస్థితులు తలెత్తితే అత్యున్నత ప్రమాణాలతో ప్రభుత్వ ఆమోదమున్న ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తామని కంపెనీ తెలిపింది. వ్యాక్సిన్ వల్లనే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని రుజువైతే నష్ట పరిహారం కూడా చెల్లిస్తామంది.
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ( Corona vaccination ) ప్రక్రియ జరుగుతోంది. ప్రధాని నరేంద్రమోదీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. తొలిదశలో ఫ్రంట్‌లైన్ వర్కర్లకు అందిస్తున్నారు. తెలంగాణలో వ్యాక్సిన్ వేయించుకునేవారి అంగీకారపత్రంతోనే భారత్ బయోటెక్ వ్యాక్సిన్ అందిస్తున్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ( Covishield vaccine ) విషయంలో ఏ విధమైన అంగీకారపత్రం తీసుకోవడం లేదు.
Also read: Coronavirus Vaccination: అలాంటి వారు వ్యాక్సిన్ తీసుకోవద్దు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook