ఉప ఎన్నికలు 2018: దేశ వ్యాప్తంగా 4 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రారంభం

సోమవారం (మే 28, 2018) దేశ వ్యాప్తంగా నాలుగు లోక్‌సభ, పది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

Last Updated : May 28, 2018, 11:10 PM IST
ఉప ఎన్నికలు 2018: దేశ వ్యాప్తంగా 4 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రారంభం

న్యూఢిల్లీ: సోమవారం (మే 28, 2018) దేశ వ్యాప్తంగా నాలుగు లోక్‌సభ, పది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. యూపీలోని కైరానా, మహారాష్ట్రలోని పాల్ఘర్, భండారా–గోండియా స్థానాలతో పాటు నాగాలాండ్‌లోని ఏకైక ఎంపీ స్థానానికి పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. నూపుర్‌(ఉత్తర ప్రదేశ్‌), షాకోట్‌(పంజాబ్‌), జోకిహట్‌(బిహార్‌), గొమియా, సిల్లీ(జార్ఖండ్‌), చెంగన్నూరు(కేరళ), పాలుస్‌ కడేగావ్‌(మహారాష్ట్ర), అంపటి (మేఘాలయ), థరాలి(ఉత్తరాఖండ్‌) మహేస్థల( పశ్చిమబెంగాల్‌), ఆర్ ఆర్ నగర్ (కర్ణాటక) అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక జరుగుతుండగా.. మే 31న గురువారం ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.

 

 

 

 

 

 

 

 

బీజేపీ ఎంపీ హుకుం సింగ్‌ మరణంతో యూపీలోని కైరానాకు ఉప ఎన్నికలు జరుగుతుండగా.. ఆయన కుమార్తె మ్రిగాంకా సింగ్‌ బీజేపీ తరఫున పోటీలో ఉన్నారు. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ మద్దతుతో లోక్‌దళ్‌ అభ్యర్థి తబస్సుమ్‌ ఆమెతో తలపడుతున్నారు. మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో బీజేపీ ఎంపీ చింతామన్‌ వంగర మరణంతో ఉప ఎన్నిక జరుగుతోంది. ఆశ్చర్యకరంగా వంగర కుమారుడు శ్రీనివాస్‌ శివసేన తరఫున బరిలో ఉండగా.. బీజేపీ నుంచి గవిట్‌ పోటీపడుతున్నారు. భండారా–గోండియా సిట్టింగ్‌ ఎంపీ ఆ స్థానానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరడంతో తాజా ఎన్నికలు అనివార్యమయ్యాయి.

మొత్తంగా పది రాష్ట్రాలలో ఈ ఉప ఎన్నికలు జరుగుతుండటంతో అధికార ప్రతిపక్షాల మధ్య పోటాపోటీ పరిస్థితి నెలకొంది. రాబోయే 2019 లోక్‌సభ ఎన్నికల సమరంలో జనం నాడికి ఈ ఉప ఎన్నికలను సూచీలుగా భావిస్తున్నారు.

ఎన్నికలు జరుగనున్న నాలుగు ఎంపి సీట్లలో మూడు బిజెపి ఖాతాలో ఉన్నాయి.ఇక ఇటీవలే కర్నాటకలో కాంగ్రెస్‌-జెడిఎస్ సంకీర్ణం కొలువుదీరడం, ప్రతిపక్షాల సంఘటిత శక్తికి సంకేతాలు వెలువడటం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ మొత్తం 14 స్థానాలకు ఉప ఎన్నికలకు విశేష ప్రాధాన్యత సంతరించుకుంది.

Trending News