Chhattisgarh High Court: విడాకులు భరణానికి సంబంధించిన ఓ కేసు విచారణలో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు చర్చనీయాంశంగా మారింది. కేసు విచారణలో వెలుగుచూసిన కొత్తకోణంపై చర్చ మొదలైంది. సొంత భార్యాభర్తలైనా సరే ఒకరికి తెలియకుండా మరొకరి కాల్స్ రికార్డ్ చేయడం అనేది గోప్యత హక్కుకు పాతర వేయడమేనని కోర్టు స్పష్టం చేసింది.
ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ జిల్లాలో చోటుచేసుకున్న భార్యాభర్తల విడాకులు, భరణాల కేసు ఇది. ఈ కేసులో మహిళకు భరణం చెల్లించాలని మహాసముంద్ జిల్లా ఫ్యామిలీ కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే ఆ భర్త మాత్రం భరణం చెల్లించేందుకు నిరాకరించాడు. దాంతో ఆమె మళ్లీ కోర్టును ఆశ్రయించింది. ఈసారి ఆ భర్త తన మొబైల్ ఫోన్‌లో తన భార్య ఒకరితో మాట్లాడిన ఫోన్ రికార్డింగ్‌ను అనుమతించాలని కోరాడు. ఈ రికార్డింగ్ ఆధారంగా ఆమెను క్రాస్ ఎగ్జామిన్ చేసి భార్య ప్రవర్తన మంచిది కాదని నిరూపించాలనేది ఆ భర్త ప్రయత్నం. ఫ్యామిలీ కోర్టు కూడా ఇందుకు అనుమతించింది. ఫ్యామిలీ కోర్టు ఆదేశాల్ని సవాలు చేస్తూ ఆ మహిళ ఛత్తీస్‌గఢ్ హైకోర్టును ఆశ్రయించింది.
ఈ కేసు హైకోర్టుకు చేరగానే గోప్యత హక్కు వెలుగులోకి వచ్చింది. తనకు తెలియకుండా తన భర్త కాల్స్ రికార్డింగ్ చేశాడని ఇది గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని పిటీషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఫోన్ రికార్డింగ్‌ను అనుమతించడం ద్వారా ట్రయల్ కోర్టులో న్యాయపరమైన తప్పిదం జరిగినట్టు చెప్పారు. అంతేకాకుండా ట్రయల్ కోర్టు ఆదేశాలు పిటీషనర్ గోప్యత హక్కును భంగం కల్గించడమేనన్నారు. పిటీషనర్‌కు తెలియకుండా ఫోన్ రికార్డింగ్ చేసినందున దానిని సాక్షంగా పరిగణించలేమన్నారు.
ఈ కేసుని విచారించిన ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సింగిల్ బెంచ్ సంచలన తీర్పునిచ్చింది. పిటీషనర్ తరపు న్యాయవాది వాదనతో కోర్టు ఏకీభవించింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గోప్యత హక్కుకు భంగం కల్గించడమేనని కోర్టు స్ఫష్టం చేసింది. 2021లో మహాసముంద్ ఫ్యామిలీ కోర్టు ఆదేశాల్ని రద్దు చేసింది. సొంత భార్యా భర్తలైనా సరే ఒకరికి తెలియకుండా మరొకరి ఫోన్ రికార్డింగ్ చేయడం తప్పని తేల్చింది.
Also read: Rain Alert: ఏపీ, తెలంగాణకు వర్ష సూచన, ఎండలు-ఉక్కపోత నుంచి ఉపశమనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook