Chidambaram: బాబ్రీ మసీదును ఎవరూ కూల్చలేదు, చిదంబరం కీలక వ్యాఖ్యలు

Chidambaram: అయోధ్యలోని వివాదాస్పద బాబ్రీ మసీదు అంశం మరోసారి తెరపైకొచ్చింది. మసీదు కూల్చివేత వ్యవహారంపై మాజీ మంత్రి చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలిప్పుడు వైరల్ అవుతున్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 11, 2021, 07:32 AM IST
  • బాబ్రీమసీదు కూల్చివేతపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కీలక వ్యాఖ్యలు
  • జెస్సికాను ఎవరూ చంపనట్టే..బాబ్రీ మసీదును ఎవరూ కూల్చలేదన్న చిదంబరం
  • సల్మాన్ ఖుర్షీద్ రాసిన సన్‌రైజ్ ఓవర్ అయోధ్య పుస్తకావిష్కరణలో చిదంబరం
Chidambaram: బాబ్రీ మసీదును ఎవరూ కూల్చలేదు, చిదంబరం కీలక వ్యాఖ్యలు

Chidambaram: అయోధ్యలోని వివాదాస్పద బాబ్రీ మసీదు అంశం మరోసారి తెరపైకొచ్చింది. మసీదు కూల్చివేత వ్యవహారంపై మాజీ మంత్రి చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలిప్పుడు వైరల్ అవుతున్నాయి.

అయోధ్యలోని(Ayodhya)రామజన్మభూమి వివాదం ముగిసింది. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పుతో ఇరువర్గాలు అంగీకరించాయి. మరోవైపు అయోధ్యలో శ్రీరామమందిర నిర్మాణం అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ నేపధ్యంలో బాబ్రీ మసీదు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం కీలకమైన వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదును(Babri Masjid) ఎవరూ కూల్చలేదని చెప్పేందుకు దురదృష్టవశాత్తూ మనమెవరూ సిగ్గుపడటం లేదని చిదంబరం విమర్శించారు. జెస్సికాను ఎవరూ చంపలేదనేది ఎంత నిజమో..బాబ్రీ మసీదును(Babri Masjid Demolition)ఎవరూ కూల్చలేదనేది అంతే నిజమని ఆయన వ్యంగ్యంగా మాట్లాడారు. 

కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ అయోధ్య తీర్పుపై రాసిన సన్‌రైజ్ ఓవర్ అయోధ్య(Sunrise over Ayodhya)పుస్తకావిష్కరణలో పి చిదంబరం మాట్లాడారు. 1992 డిసెంబర్ 6న ఏం జరిగిందో.. అది చాలా తప్పని, అది మన రాజ్యాంగాన్ని అవమానపరిచిందని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పు తర్వాత ఊహించని రీతిలో సంఘటనలు జరిగాయన్నారు. ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ వ్యవధిలో నిందితులంతా నిర్దోషులుగా విడుదలయ్యారని విమర్శించారు. కాబట్టి జెస్సికాను ఎవరూ చంపలేదు, బాబ్రీ మసీదును ఎవరూ కూల్చలేదు అంటూ ఎద్దేవా చేశారు. అయితే జవహర్‌లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, ఏపీజే అబ్దుల్ కలాం ఉన్న ఈ దేశంలో.. ఈ ముగింపు మనల్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుందని చిదంబరం(Chidambaram) తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా.. బాబ్రీ మసీదును ఎవరూ కూల్చలేదని చెప్పడానికి మనం సిగ్గుపడడం లేదన్నారు. అయోధ్య తీర్పును ఇరుపక్షాలు అంగీకరించాయి కాబట్టే ఇది సరైన తీర్పుగా మారిందని.. అంతే తప్ప మరో మార్గం కాదన్నారు. ఇరుపక్షాలు అంగీకరించినందున ఈ తీర్పు సరైనది కాబోదన్నారు.

Also read: Mother sells 3day old son : పేద‌రికంతో పేగుబంధాన్ని అమ్ముకున్న తల్లి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News