Delhi Election Offer: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025 పోలింగ్ జరుగుతోంది. ఓటింగ్ శాతం పెంచేందుకు అటు కేంద్ర ఎన్నికల సంఘం ఇటు స్వచ్ఛంధ సంస్థలు, వ్యాపారులు అంతా తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని వ్యాపార సముదాయాలు వినూత్న ప్రచారం మొదలెట్టాయి. ఓటు వేస్తే చాలు.50 శాతం డిస్కౌంట్ ఇస్తామంటున్నాయి. ఈ ఆఫర్ సంగతేంటో తెలుసుకుందాం.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ట్రేడర్స్ అండ్ ఇండస్ట్రీ కాన్ఫెడరేషన్ సెలూన్ అండ్ బ్యూటీ పార్లర్ కౌన్సిల్ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఢిల్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటే చాలు 50 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఢిల్లీ ఎన్నికల్లో ఓటేసిన తరువాత వేలిపై ఉన్న సిరాను చూపిస్తే చాలు సెలూన్ లేదా బ్యూటీ పార్లర్ సేవల్లో 50 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. హెయిర్ కట్, షేవింగ్, ఫేషియల్, మసాజ్, డిటాన్ ప్యాక్ వంటి సర్వీసుల్లో 50 శాతం తగ్గింపు పొందవచ్చు. ఫిబ్రవరి 6వ తేదీ వరకూ ఈ ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. చాలామంది బ్యూటీషియన్లు ఈ ఆఫర్ అమలు చేసేందుకు ముందుకొచ్చారు.
ఢిల్లీలో గతంలో మూడు పర్యాయాల్లో ఎప్పుడూ 67 శాతం ఓటింగ్ దాటలేదు. సాధారణంగా నగర ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువే ఉంటుంది. అందుకే నగర ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. 2013లో జరిగిన ఎన్నికల్లో ఢిల్లీలో 66 శాతం పోలింగ్ నమోదు కాగా 2015లో 67.47 శాతం నమోదైంది. ఇక 2020 ఢిల్లీ ఎన్నికల్లో 62.59 శాతం నమోదైంది.
పోలింగ్ రోజు వివిధ సంస్థలు స్వచ్ఛందంగా ప్రకటించే డిస్కౌంట్ ఆఫర్లు కచ్చితంగా ఓటింగ్ శాతం పెంచేందుకు ఎంతో కొంత దోహదపడతాయనే ఆలోచన అందరిలో ఉంది.
Also read: Illegal Indian Immigrants: అమెరికా నుంచి అక్రమ వలసల గెంటివేత షురూ, 205 మందితో తొలి విమానం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి